'రాజుగారి గది' చూస్తూ ఓ వ్యక్తి హఠాన్మరణం!

టెలివిజన్‌ రియాల్టీ షో ఆధారంగా నిర్మితమైన ఓ క్రైం హర్రర్‌ సినిమా ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఈ సంఘటన హైదరబాద్‌లోని మెట్రో సినిమా కాంప్లెక్స్‌లో జరిగింది. ‘రాజుగారి గది’ అనే ఈ తెలుగు సినిమాకు టీవీ రియాల్టీ షోల్లో ఒక వెలుగు వెలిగిన ఓంకార్‌ దర్శకత్వం వహించాడు. సినిమాలో హర్రర్‌ పాళ్ళు ఎక్కువగా ఉండడం… క్రైం కాస్తంత శ్రుతి మించడంతో ప్రేక్షకుడు ఉద్వేగానికి గురయినట్టు తెలుస్తోంది. సినిమా చూస్తుండగానే గుండె ఆగిపోయి మరణించాడంటున్నారు. అయితే ఈ […]

Advertisement
Update:2015-10-30 12:33 IST

టెలివిజన్‌ రియాల్టీ షో ఆధారంగా నిర్మితమైన ఓ క్రైం హర్రర్‌ సినిమా ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఈ సంఘటన హైదరబాద్‌లోని మెట్రో సినిమా కాంప్లెక్స్‌లో జరిగింది. ‘రాజుగారి గది’ అనే ఈ తెలుగు సినిమాకు టీవీ రియాల్టీ షోల్లో ఒక వెలుగు వెలిగిన ఓంకార్‌ దర్శకత్వం వహించాడు. సినిమాలో హర్రర్‌ పాళ్ళు ఎక్కువగా ఉండడం… క్రైం కాస్తంత శ్రుతి మించడంతో ప్రేక్షకుడు ఉద్వేగానికి గురయినట్టు తెలుస్తోంది. సినిమా చూస్తుండగానే గుండె ఆగిపోయి మరణించాడంటున్నారు. అయితే ఈ సంఘటన గురించి తెలుసుకున్న దర్శకుడు ఓంకార్‌ మృతుని కుటుంబానికి లక్ష రూపాయల పరిహారాన్ని ప్రకటించారు.

Tags:    
Advertisement

Similar News