డిష్యూ డిష్యూం చేస్తున్న బన్నీ

మొన్నటి వరకు హీరోయిన్ తో చిందేశాడు. చక్కగా ఓ రొమాంటిక్ సాంగ్ పూర్తిచేశాడు. ఇప్పుడు యాక్షన్ మోడ్ లోకి ఎంటరయ్యాడు అల్లు అర్జున్. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు బన్నీ. ఈ సినిమా కు సంబంధించి మొన్నటివరకు సాంగ్ తీశాడు. ఈరోజు నుంచి యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. రామోజీ ఫిలింసిటీలో వేసిన ఓ సెట్ లో బన్నీతో ఈ పైట్ సీన్లు పిక్చరైజ్ చేస్తారు. హీరో బన్నీ, విలన్ ప్రదీప్ […]

Advertisement
Update:2015-10-30 00:36 IST
మొన్నటి వరకు హీరోయిన్ తో చిందేశాడు. చక్కగా ఓ రొమాంటిక్ సాంగ్ పూర్తిచేశాడు. ఇప్పుడు యాక్షన్ మోడ్ లోకి ఎంటరయ్యాడు అల్లు అర్జున్. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు బన్నీ. ఈ సినిమా కు సంబంధించి మొన్నటివరకు సాంగ్ తీశాడు. ఈరోజు నుంచి యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. రామోజీ ఫిలింసిటీలో వేసిన ఓ సెట్ లో బన్నీతో ఈ పైట్ సీన్లు పిక్చరైజ్ చేస్తారు. హీరో బన్నీ, విలన్ ప్రదీప్ రావత్ గ్యాంగ్ కు మధ్య ఈ ఫైట్ సీన్ ఉంటుంది. ఈ షెడ్యూల్ అయిపోయిన వెంటనే విదేశాల్లో మరో భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, క్యాథరీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కీలక పాత్రలో ఆది పినిశెట్టి నటిస్తున్నాడు. మరో కీలకపాత్రలో శ్రీకాంత్ కూడా నటిస్తున్నాడు. తమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.
Tags:    
Advertisement

Similar News