వరుణ్ తేజకు పెరిగిన డిమాండ్

కంచె సినిమాతో వరుణ్ తేజకు డిమాండ్ బాగా పెరిగింది. కంచె సినిమాకు ముందు దర్శకుల వెంట వరుణ్ తేజ పడేవాడు. ఏదైనా మంచి కథ ఉంటే సూచించమని నాగబాబు దర్శకులను కోరేవాడు. కానీ ఇప్పుడు కంచె సినిమా సక్సెస్ అవ్వడంతో దర్శకులే నాగబాబు ఇంటికి వస్తున్నారు. ప్రస్తుతం పూరి జగన్నాధ్ తో మా అమ్మ సీతామాలక్ష్మి సినిమాను కంప్లీట్ చేసిన వరుణ్ తేజ.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై దృష్టిపెట్టాడు. ఇందులో భాగాంగా ఇద్దరు దర్శకులు వరుణ్ […]

Advertisement
Update:2015-10-28 00:35 IST
కంచె సినిమాతో వరుణ్ తేజకు డిమాండ్ బాగా పెరిగింది. కంచె సినిమాకు ముందు దర్శకుల వెంట వరుణ్ తేజ పడేవాడు. ఏదైనా మంచి కథ ఉంటే సూచించమని నాగబాబు దర్శకులను కోరేవాడు. కానీ ఇప్పుడు కంచె సినిమా సక్సెస్ అవ్వడంతో దర్శకులే నాగబాబు ఇంటికి వస్తున్నారు. ప్రస్తుతం పూరి జగన్నాధ్ తో మా అమ్మ సీతామాలక్ష్మి సినిమాను కంప్లీట్ చేసిన వరుణ్ తేజ.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై దృష్టిపెట్టాడు. ఇందులో భాగాంగా ఇద్దరు దర్శకులు వరుణ్ తేజకు రెండు కథలు వినిపించారు.
దర్శకుడు గోపీచంద్ మలినేని నాగాబాబుకు ఓ కథ వినిపించాడు. నాగబాబు విన్న తర్వాత వరుణ్ తేజ కూడా కథ విన్నాడు. క్రీడల నేపథ్యంలో సాగే కథ ఇది. స్టోరీలైన్ ఫ్రెష్ గా ఉండడంతో సినిమా చేసే ఆలోచనలో పడ్డాడు వరుణ్ తేజ. వరుణ్ తేజ ఫిజిక్, హైట్ కు ఈ కథ సూటవుతుందని అంటున్నారు. ఈ కథ కనుక ఓకే అయితే, వరుణ్ తేజతో ముకుంద సినిమాను నిర్మించిన నల్లమలపు బుజ్జి, ఠాగూర్ మధులే నిర్మాతలుగా వ్యవహరిస్తారు. మరోవైపు వీరుపోట్ల కూడా వరుణ్ కు కథ వినిపించాడని తెలుస్తోంది. అయితే ఈ ఇద్దరు దర్శకుల్లో గోపీచంద్ మలినేని చెప్పిన కథకే మెగాకాంపౌండ్ మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే వరుణ్ తేజ-గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో సినిమా డిసెంబర్ నుంచి సెట్స్ పైకి వస్తుంది.
Tags:    
Advertisement

Similar News