ఆర్థిక రాజధానిగా విజయవాడ

కేవలం రాజధాని నగరంగానే కాక ఆర్థిక రాజధానిగా కూడా విజయవాడ వెలుగొందుతోంది. ముఖ్యంగా కార్ల కంపెనీలు, ఆటోమొబైల్ కంపెనీలు విజయవాడ నగరం సరిహద్దుల్లో పెద్ద సంఖ్యలో ఏర్పాటవుతున్నాయి. భవానీపురంలో 30కిపైగా ప్రధాన ఫార్మా కంపెనీల ఏర్పాటుకు అంతా సిద్ధమైంది. గన్నవరం, గొల్లపూడి ప్రాంతాల్లో టాటా, నిస్సాన్, టయోటా, బెంజ్ షోరూమ్ లు పెద్దఎత్తున ఏర్పాటయ్యాయి. వీటితోపాటు కార్లు, ద్విచక్ర వాహనాల విడి విభాగాల తయారీ యూనిట్లు కూడా విజయవాడలో ఏర్పాటుకు సర్వం సిద్ధమయ్యాయి. విజయవాడ నగరం ప్రధానంగా […]

Advertisement
Update:2015-10-28 07:09 IST

కేవలం రాజధాని నగరంగానే కాక ఆర్థిక రాజధానిగా కూడా విజయవాడ వెలుగొందుతోంది. ముఖ్యంగా కార్ల కంపెనీలు, ఆటోమొబైల్ కంపెనీలు విజయవాడ నగరం సరిహద్దుల్లో పెద్ద సంఖ్యలో ఏర్పాటవుతున్నాయి. భవానీపురంలో 30కిపైగా ప్రధాన ఫార్మా కంపెనీల ఏర్పాటుకు అంతా సిద్ధమైంది. గన్నవరం, గొల్లపూడి ప్రాంతాల్లో టాటా, నిస్సాన్, టయోటా, బెంజ్ షోరూమ్ లు పెద్దఎత్తున ఏర్పాటయ్యాయి. వీటితోపాటు కార్లు, ద్విచక్ర వాహనాల విడి విభాగాల తయారీ యూనిట్లు కూడా విజయవాడలో ఏర్పాటుకు సర్వం సిద్ధమయ్యాయి. విజయవాడ నగరం ప్రధానంగా వాణిజ్యంపైనే ఆధారపడి ఉంది. రాష్ట్ర విభజనతో హైదరాబాద్ నుంచి తరలివచ్చే కంపెనీల ద్వారా ఇక్కడ ఆదాయం 30 శాతంకు పైగా పెరిగింది. తాజ్‌ గ్రూప్, ఐటీసీ గ్రూపులు రాజధాని ప్రాంతంలో అధికంగా స్టార్ హోటళ్ల నిర్మాణానికి స్థలాన్వేషణ పూర్తిచేశాయి. ఇవి కాకుండా అమరావతి ప్రాంతంలో ఫైవ్ స్టార్ కేటగిరీ హోటళ్లు ఎనిమిది ఏర్పాటు చేయడానికి పలు సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. రాష్ట్ర విభజనతో జిల్లా వాణిజ్య పన్నుల శాఖ ఆదాయం గణనీయంగా రెట్టింపైంది.

Tags:    
Advertisement

Similar News