బీహార్‌లో అసదుద్దీన్‌ ఓవైసీ అరెస్ట్‌

ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీని బీహార్ పోలీసులు అరెస్టు చేశారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అసదుద్దీన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని అభియోగం రావడంతో బీహార్‌లోని పూర్ణియా జిల్లాలో బైసాయి పోలీసులు అరెస్టు చేశారు. ఇంతకుముందు అసదుద్దీన్ సోదరుడు అక్బరుద్దీన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసి అరెస్టు అయ్యారు. బీహార్‌ ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు విషయంలో ఓవైసీని అరెస్ట్ చేయాలని కిషన్ గంజ్ ఎస్పీ రాజీవ్ రంజన్ పోలీసులకు ఆదేశించారు. ఇటీవల కిషన్‌ గంజ్ […]

Advertisement
Update:2015-10-28 00:32 IST

ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీని బీహార్ పోలీసులు అరెస్టు చేశారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అసదుద్దీన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని అభియోగం రావడంతో బీహార్‌లోని పూర్ణియా జిల్లాలో బైసాయి పోలీసులు అరెస్టు చేశారు. ఇంతకుముందు అసదుద్దీన్ సోదరుడు అక్బరుద్దీన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసి అరెస్టు అయ్యారు. బీహార్‌ ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు విషయంలో ఓవైసీని అరెస్ట్ చేయాలని కిషన్ గంజ్ ఎస్పీ రాజీవ్ రంజన్ పోలీసులకు ఆదేశించారు. ఇటీవల కిషన్‌ గంజ్ జిల్లాలో పర్యటించిన అక్బరుద్దీన్‌ ఓ బహిరంగ సభలో మోదీతో పాటు బాబ్రీ మసీదు కూల్చివేతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ అల్లర్ల సమయంలో మోదీపై చార్జిషీట్ దాఖలు చేసి ఉంటే ఈ రోజు అతడు ఈ దేశానికి ప్రధాని అయ్యేవారు కాదన్నారు. మోదీని సైతాన్ అంటూ సంబోధించడం, బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి, అయోధ్యలోని రామాలయం, బాబ్రీ మసీదు కూల్చివేత వంటి అనేక అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అరెస్టయ్యారు. ఇపుడు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలోనే అసదుద్దీన్‌ కూడా అరెస్టయ్యారు.

Tags:    
Advertisement

Similar News