ఇది సల్మాన్ 'ప్రేమలీల'
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’. సోనమ్ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సూరజ్ బరజాత్య దర్శకుడు. నార్త్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాణ సంస్థగా పేరున్న రాజశ్రీ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. గతంలో రాజశ్రీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సల్మాన్ హీరోగా రూపొందిన మైనే ప్యార్ కియా, హమ్ ఆప్ కే హై […]
Advertisement
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’. సోనమ్ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సూరజ్ బరజాత్య దర్శకుడు. నార్త్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాణ సంస్థగా పేరున్న రాజశ్రీ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
గతంలో రాజశ్రీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సల్మాన్ హీరోగా రూపొందిన మైనే ప్యార్ కియా, హమ్ ఆప్ కే హై కౌన్ చిత్రాలు ప్రేమ పావురాలు, ప్రేమాలయం పేర్లతో తెలుగులో రిలీజ్ అయి మంచి విజయాలు సాధించాయి. ఆ తరువాత సల్మాన్ హీరోగా నటించిన సినిమాలేవి తెలుగు డబ్ కాలేదు. మళ్లీ ఇంత కాలం తరువాత అదే బ్యానర్ లో సల్మాన్ హీరోగా తెరకెక్కిన ప్రేమ్ రతన్ ధన్ పాయో చిత్రాన్ని ప్రేమలీల పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ చరణ్ ఈ సినిమాలో సల్మాన్ పాత్రకు డబ్బింగ్ చెపుతుండగా, హిందీలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా నవంబర్ 12న తెలుగులో కూడా భారీ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. మరి ఈ కండలవీరుడు సౌత్ ఆడియన్స్ ను తన ప్రేమలీలతో ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి.
Advertisement