ఉప ఎన్నికల బాధ్యత.. హరీశ్‌దే!
వరంగల్ పార్లమెంటు స్థానానికి షెడ్యూలు ఖరారైన నేపథ్యంలో పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. కాంగ్రెస్, బీజేపీ-టీడీపీలు బలమైన అభ్యర్థి కోసం కసరత్తులు చేస్తున్నాయి. అయితే, మొదటి నుంచి ఉప ఎన్నిక విజయంపై టీఆర్ఎస్ ధీమాగానే ఉంది. అభ్యర్థి ఎవరైనా విజయం తమదేన్న విశ్వాసమే ఇందుకు కారణం. వరంగల్ ఉప-ఎన్నికతోపాటు, నారాయణ్‌ఖేడ్ ఉప ఎన్నిక బాధ్యతలను పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరొందిన మంత్రి హరీశ్‌రావుకు అప్పజెప్పాలని అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్రం విడిపోకముందు నుంచి ఎక్కడ ఉప […]
Advertisement
వరంగల్ పార్లమెంటు స్థానానికి షెడ్యూలు ఖరారైన నేపథ్యంలో పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. కాంగ్రెస్, బీజేపీ-టీడీపీలు బలమైన అభ్యర్థి కోసం కసరత్తులు చేస్తున్నాయి. అయితే, మొదటి నుంచి ఉప ఎన్నిక విజయంపై టీఆర్ఎస్ ధీమాగానే ఉంది. అభ్యర్థి ఎవరైనా విజయం తమదేన్న విశ్వాసమే ఇందుకు కారణం. వరంగల్ ఉప-ఎన్నికతోపాటు, నారాయణ్‌ఖేడ్ ఉప ఎన్నిక బాధ్యతలను పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరొందిన మంత్రి హరీశ్‌రావుకు అప్పజెప్పాలని అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్రం విడిపోకముందు నుంచి ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా.. అక్కడ టీఆర్ ఎస్ విజయాలు సాధిస్తుందంటే.. అదంతా హరీశ్ రావు వల్లేనని పార్టీ గుర్తించడమే ఇందుకు కారణం. అందుకే అభ్యర్థి ఎంపిక కంటే.. హరీశ్‌కు ఎన్నికల బాధ్యతలు అప్పజెప్పి పార్టీ సగం భారం దించుకుందని ప్రత్యర్థుల భావిస్తున్నారు. ఇక ఈ రెండు స్థానాలకు అభ్యర్థుల ఎంపికే మిగిలింది.
అందుకే నారాయణఖేడ్‌లో పోటీ!
ఇటీవల కిష్టారెడ్డి హఠాన్మరణంతో నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. కాంగ్రెస్ పెద్దల విజ్ఞప్తి మేరకు అక్కడ ఎన్నిక ఏకగ్రీవానికి టీఆర్ ఎస్ సుముఖత వ్యక్తం చేసింది. అయితే, రుణమాఫీ విషయంలో కాంగ్రెస్-టీడీపీ కలిసి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం, ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని చెబుతూ రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వడంతో సీఎం కేసీఆర్ తన మనసు మార్చుకున్నారు. పైగా భవిష్యత్తులో ఓటమికి భయపడి దూరంగా ఉన్నారని టీడీపీ- కమ్యూనిస్టులు విమర్శించే అవకాశం ఉంది. వారికి ఈ విషయంలో ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని సీఎం అనుకున్నారు. అందుకే, ఇచ్చిన మాటను పక్కనబెట్టి తమపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని బలంగా చాటేందుకు నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానంలో పోటీ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు.
అతడుంటే.. విజయమే!
2009లో మలిదశ ఉద్యమం మొదలైన తరువాత టీఆర్ ఎస్ ఎక్కడా ఓడిన దాఖలాలు లేవు. టీడీపీ నుంచి రాజీనామా చేసిన పోచారం శ్రీనివాసరెడ్డి (బాన్సువాడ) టీఆర్ ఎస్ నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నిక బాధ్యత హరీశ్ తీసుకున్నాడు. అది మొదలు.. వరంగల్‌లో కాంగ్రెస్ నుంచి పార్టీలో చేరిన టీ. రాజయ్యను, పరకాలలో రాజకీయంగా పాతుకుపోయిన వైఎస్సార్ సీపీ నుంచి పోటీ చేసిన కొండాసురేఖను మట్టికరిపించి.. మొలుగూరి భిక్షపతిని ఒంటి చేత్తో గెలిపించుకు వచ్చాడు హరీశ్. కొత్త రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడంలోనూ హరీశ్‌ది కీలకపాత్రే! తాజాగా కేసీఆర్ రాజీనామాతో ఖాళీ అయిన మెదక్ పార్లమెంటు సీటులో పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి విజయం నల్లేరు మీద నడకే అయిందంటే.. అందుకు కారణం హరీశ్ కాన్వాసింగే! ప్రస్తుతం రెండు వేర్వేరు జిల్లాల్లో ఒకటి అసెంబ్లీ, మరోటి పార్లమెంటు స్థానం ఎన్నిక బాధ్యతలు అప్పజెప్పడంతో హరీశ్‌పై ఒత్తిడి ఎక్కువగా ఉంది. పార్టీ మాత్రం బాధ్యతలు హరీశ్‌కు అప్పగించి నిశ్చింతగా ఉంది. ఎలాగూ చివరి రోజు కేసీఆర్ మెరుపు ప్రచారం.. బహిరంగ సభలు ఉండనే ఉంటాయన్నది పార్టీ ఆలోచన!
Advertisement