ఆసిన్ పెళ్లి ఫిక్స్

హృదయం ఎక్కడున్నాది అంటూ తెలుగువారిని అలరించిన హీరోయిన్ అసిన్ పెళ్లిపీటలు ఎక్కబోతోంది. తన నాలుగేళ్లు ప్రేమ ప్రయాణాన్ని పెళ్లి వైపు తీసుకెళ్తోంది. జాతీయ మీడియా కథనం ప్రకారం అసిన్ నవంబర్ 26న ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ శర్మతో ఏడుఅడుగులు వేయబోతోంది. ఢిల్లీలోని ప్రముఖ హోటల్‌లో వీరి వివాహం జరగనుంది. నవంబర్ 27న ఢిల్లీలోని వెస్ట్ అండ్ గ్రీన్స్‌ ఫాంహౌజ్‌లో రిసెప్షన్ జరుగుతుంది. ఆ మరుసటి రోజు ముంబాయిలోనూ స్నేహితుల కోసం మరో రిసెప్షన్ ఇవ్వనున్నారు. ఇప్పటికే పెళ్లి […]

Advertisement
Update:2015-10-25 15:22 IST

హృదయం ఎక్కడున్నాది అంటూ తెలుగువారిని అలరించిన హీరోయిన్ అసిన్ పెళ్లిపీటలు ఎక్కబోతోంది. తన నాలుగేళ్లు ప్రేమ ప్రయాణాన్ని పెళ్లి వైపు తీసుకెళ్తోంది. జాతీయ మీడియా కథనం ప్రకారం అసిన్ నవంబర్ 26న ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ శర్మతో ఏడుఅడుగులు వేయబోతోంది. ఢిల్లీలోని ప్రముఖ హోటల్‌లో వీరి వివాహం జరగనుంది.

నవంబర్ 27న ఢిల్లీలోని వెస్ట్ అండ్ గ్రీన్స్‌ ఫాంహౌజ్‌లో రిసెప్షన్ జరుగుతుంది. ఆ మరుసటి రోజు ముంబాయిలోనూ స్నేహితుల కోసం మరో రిసెప్షన్ ఇవ్వనున్నారు. ఇప్పటికే పెళ్లి పనులు కూడా ప్రారంభమైనట్టు అసిన్ స్నేహితులు చెబుతున్నారు. పెళ్లికుమారుడు రాహుల్ శర్మ సెల్ కంపెనీ మైక్రోమాక్స్ వ్యవస్థాపకుల్లో ఒకరు. దాదాపు నాలుగేళ్లుగా వీరిద్దరు ప్రేమించుకుంటున్నారు. స్నేహితుల ద్వారా వీరి మధ్య పరిచయం ఏర్పడింది. పెద్దలను కూడా ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నారు.

Tags:    
Advertisement

Similar News