బాహుబలి గొప్పతనం రాజమౌళీది కాదా ?

‘బాహుబలి’ మన తెలుగోడికి ఒక గొప్ప గౌరవం, గుర్తింపు తెచ్చిపెట్టింది అనడంలో ఏ మాత్రం సందేహించనవసరం లేదు. ఈ క్రెడిట్‌లో సింహ భాగం డైరెక్టర్ రాజమౌళికి చెందుతుందనేది నిర్వివాదాంశం. ముఖ్యంగా హీరో ప్రభాస్ కి దేశ వ్యాప్తంగా నేషనల్ స్టార్‌గా పాపులారిటీ ‘బాహుబలి’ వలనే వచ్చింది. కాని ప్రభాస్ తాను నేషనల్ స్టార్ అనుకోవట్లేదు.. పాపులారిటీ వచ్చిన మాట వాస్తవమే కాని.. ఒక్క సినిమాతో నేషనల్ స్టార్ అవ్వరని .. బాహుబలి తనకే కాదు ఎందరికో గుర్తింపు […]

Advertisement
Update:2015-10-22 09:32 IST

‘బాహుబలి’ మన తెలుగోడికి ఒక గొప్ప గౌరవం, గుర్తింపు తెచ్చిపెట్టింది అనడంలో ఏ మాత్రం సందేహించనవసరం లేదు. ఈ క్రెడిట్‌లో సింహ భాగం డైరెక్టర్ రాజమౌళికి చెందుతుందనేది నిర్వివాదాంశం. ముఖ్యంగా హీరో ప్రభాస్ కి దేశ వ్యాప్తంగా నేషనల్ స్టార్‌గా పాపులారిటీ ‘బాహుబలి’ వలనే వచ్చింది. కాని ప్రభాస్ తాను నేషనల్ స్టార్ అనుకోవట్లేదు.. పాపులారిటీ వచ్చిన మాట వాస్తవమే కాని.. ఒక్క సినిమాతో నేషనల్ స్టార్ అవ్వరని .. బాహుబలి తనకే కాదు ఎందరికో గుర్తింపు తెచ్చిందని అభిప్రాయపడ్డారు.
అసలు బాహుబలికి వస్తున్న ప్రశంసలు అన్నీ రాజమౌళికే చెందుతాయని.. కాని ఆయన మాత్రం ఎంతో వినమ్రంగా ఆ ప్రశంసలను ఇటు వైపు (ప్రభాస్ & టీం) మళ్ళిస్తున్నారని ప్రభాస్ అభిప్రాయం. తమ డైరెక్టర్ మెటిక్యులస్ ప్లానింగ్ లేకపోతే ఇంత గ్రాండ్ స్కేల్ మేకింగ్ మరియు రిలీజ్ సాధ్యం అయ్యేదికాదని వివరిస్తూ.. స్టార్స్ సినిమా సక్సెస్ కన్నా పెద్ద కాదని.. సినిమా సక్సెస్ తర్వాతే ఏదైనా అని ప్రభాస్ అభిప్రాయ పడ్డారు. ప్రభాస్ మాటలు నూటికి నూరుపాళ్ళు నిజమే కదా!

Tags:    
Advertisement

Similar News