మరోసారి పోలీస్ గా బన్నీ

అల్లు అర్జున్ ను ఇప్పటికే ఓసారి ఖాకీ డ్రెస్సులో చూసేశాం. రేసుగుర్రం సినిమా క్లైమాక్స్ లో బన్నీ పోలీస్ యూనిఫాంలోనే కనిపిస్తాడు. కాకపోతే ఆ సినిమాలో నకిలీ పోలీస్ గా కనిపిస్తాడు. పైగా క్లైమాక్స్ లో ఓ పావుగంట మాత్రమే కనిపిస్తాడు. అయితే ఈసారి ఫుల్ లెంగ్త్ పోలీస్ పాత్ర చేస్తున్నాడు అల్లువారబ్బాయ్. అవును.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు టైటిల్ తో తెరెక్కుతున్న సినిమాలో బన్నీ పాత్ర ఇదే. పక్కా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో […]

Advertisement
Update:2015-10-20 00:32 IST
అల్లు అర్జున్ ను ఇప్పటికే ఓసారి ఖాకీ డ్రెస్సులో చూసేశాం. రేసుగుర్రం సినిమా క్లైమాక్స్ లో బన్నీ పోలీస్ యూనిఫాంలోనే కనిపిస్తాడు. కాకపోతే ఆ సినిమాలో నకిలీ పోలీస్ గా కనిపిస్తాడు. పైగా క్లైమాక్స్ లో ఓ పావుగంట మాత్రమే కనిపిస్తాడు. అయితే ఈసారి ఫుల్ లెంగ్త్ పోలీస్ పాత్ర చేస్తున్నాడు అల్లువారబ్బాయ్. అవును.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు టైటిల్ తో తెరెక్కుతున్న సినిమాలో బన్నీ పాత్ర ఇదే. పక్కా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు బన్నీ. హీరోయిన్ క్యాథరీన్ తలబిరుసు ఎమ్మెల్యే పాత్రలో నటిస్తోంది. ఇక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుందని సమాచారం. రవిరాజా పినిశెట్టి కొడుకు ఆది పినిశెట్టి ఈ సినిమాతో తెలుగుతెరకు విలన్ గా పరిచయం అవుతున్నాడు. మరో మూడు కీలకపాత్రల్లో శ్రీకాంత్, సాయికుమార్, రాజీవ్ కనకాల కనిపిస్తారు. ఇలా భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను గీతాఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ తెరకెక్కిస్తున్నాడు. సినిమాను వచ్చే ఏడాది వేసవికి విడుదల చేయాలని భావిస్తున్నారు.
Tags:    
Advertisement

Similar News