బ్రూస్ లీ తో చిరుకు మొదలైన కష్టాలు..
ప్రతి ఆర్టిస్ట్ కు ఏదో ఒక చోట రిటైర్మెంట్ ఉంటుంది. నటుడిగా చిరంజీవికి రిటైర్‌మెంట్ లేదు కానీ.. 60 యేళ్ల వయసులోను పాతికేళ్ల కుర్రాడిలా చేసి మెప్పించాలంటే కష్టమే. బ్రూస్ లీ చిత్రంలో చిరు గెస్ట్ అప్పిరియన్స్ ను చూస్తే.. ఆయన్ను చూపించిన విధానాన్ని బట్టి..ఇంకా చిరు ను హి మెన్ మాదిరే చూపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన శరీరతత్వం ..రజనీకాంత్ లా రివిటా లా ఉండదు. కొంత బొద్దుగా ఉండే […]
Advertisement
ప్రతి ఆర్టిస్ట్ కు ఏదో ఒక చోట రిటైర్మెంట్ ఉంటుంది. నటుడిగా చిరంజీవికి రిటైర్‌మెంట్ లేదు కానీ.. 60 యేళ్ల వయసులోను పాతికేళ్ల కుర్రాడిలా చేసి మెప్పించాలంటే కష్టమే. బ్రూస్ లీ చిత్రంలో చిరు గెస్ట్ అప్పిరియన్స్ ను చూస్తే.. ఆయన్ను చూపించిన విధానాన్ని బట్టి..ఇంకా చిరు ను హి మెన్ మాదిరే చూపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన శరీరతత్వం ..రజనీకాంత్ లా రివిటా లా ఉండదు. కొంత బొద్దుగా ఉండే తత్వం. ఇప్పటి జనరేషన్ కు ఆడియన్స్ ను మెప్పించడం అంత ఈజి కాదు. చిరంజీవి..మెగాస్టార్.. ప్రజాదారణ వున్న నటుడు.. ఎలా చేసిన చూస్తారునుకుంటే పొరపాటే. దీంతో మళ్ళీ చిరు సినిమా కధపై చర్చ మొదలైనట్టు ఫిలిం నగర్ సమాచారం. బ్రూస్ లీ సినిమాలో చిరు పాత్ర చిన్నదైన ప్రేక్షకులు కొత్తదనాని కోరుకుంటున్నారని అర్ధమైపోయింది. ఒకరకంగా ఇప్పుడు చిరుకు కష్టాలు మొదలైనట్టే. ప్రేక్షకులని అన్నిరకాలుగా మెప్పించగలిగే కథను సిద్దంచేసుకోవాలి.
చిరు ఎలా చేసిన చూసే రోజులు ఎప్పుడో పోయాయి. ఆయన వయసకు తగ్గట్లు..కథను ఎంచుకుని చేయడమో..లేదా… కుర్ర హీరోల సరసన బలమైన రోల్స్ చేయడం..అంటే తన స్థాయికి తగ్గ క్యారెక్టర్ ఉండేలా చూసుకుని చేయడమే మంచి నిర్ణయం అంటున్నారు పరిశీలకులు. ఒకప్పటి స్టార్ డమ్ ను దృష్టిలో్ పెట్టుకునే చిరు సినిమాను చూస్తారు.. అందుకే తెలుగు నాట ఎవరు ఆయణ్ణు మెప్పించే విధంగా కూడా కథ రాయలేక పోతున్నారు..ఇలా చెప్పడం కంటే.. మనకెందుకు వచ్చిన తలనొప్పి లే అని రైటర్స్ తప్పుకుంటున్నారంటే కరెక్ట్ మరి.
Advertisement