వెంకీ స్టోరీతో నాగ్ సినిమా
కొన్ని సినిమాలు భలే గమ్మత్తుగా మారిపోతుంటాయి. కథ ఎవరి కోసమో రాసుకుంటారు. కానీ సెట్స్ పైకి వచ్చేసరికి ఆ కథలో మరో హీరో నటిస్తుంటాడు. తర్వాత అదే సినిమా హిట్టయితే, మిస్సయిన హీరో లబోదిబోమంటాడు. ఇప్పుడు తాజాగా అలాంటిదే మరో స్టోరీ, ఇంకో హీరో గూటికి చేరింది. త్వరలోనే క్రాంతిమాధవ్ దర్శకత్వంలో నటించడానికి సరంజామా అంతా సిద్ధంచేసుకున్నాడు వెంకీ. కానీ ఇంతలోనే భలేభలే మగాడివోయ్ సినిమా హిట్టవ్వడం, ఆ వెంటనే మారుతిని పిలిచి రాథ అనే పెండింగ్ […]
Advertisement
కొన్ని సినిమాలు భలే గమ్మత్తుగా మారిపోతుంటాయి. కథ ఎవరి కోసమో రాసుకుంటారు. కానీ సెట్స్ పైకి వచ్చేసరికి ఆ కథలో మరో హీరో నటిస్తుంటాడు. తర్వాత అదే సినిమా హిట్టయితే, మిస్సయిన హీరో లబోదిబోమంటాడు. ఇప్పుడు తాజాగా అలాంటిదే మరో స్టోరీ, ఇంకో హీరో గూటికి చేరింది. త్వరలోనే క్రాంతిమాధవ్ దర్శకత్వంలో నటించడానికి సరంజామా అంతా సిద్ధంచేసుకున్నాడు వెంకీ. కానీ ఇంతలోనే భలేభలే మగాడివోయ్ సినిమా హిట్టవ్వడం, ఆ వెంటనే మారుతిని పిలిచి రాథ అనే పెండింగ్ ప్రాజెక్ట్ కు వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు క్రాంతి మాధవ్ రోడ్డునపడ్డాడు. వెంకీతో సినిమా ఉందని ఇన్నాళ్లూ వెయిట్ చేసిన ఈ విలక్షణ దర్శకుడు.. ఇప్పుడు అదే కథను తీసుకెళ్లి యాజ్ ఇటీజ్ గా నాగ్ కు వినిపించాడట. సోగ్గాడే చిన్ని నాయనా షూటింగ్ పూర్తిచేసి మరో కథ కోసం వెయిట్ చేస్తున్న నాగార్జున వెంటనే ఒప్పుకున్నాడని సమాచారం. తన బ్యానర్ పైనే నిర్మించడానికి కూడా అంగీకరించాడట. అదీ స్టోరీ. గతంలో ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు అనే సినిమాలకు దర్శకత్వం వహించాడు క్రాంతి మాధవ్.
Advertisement