నడిగర్‌లో విశాల్ విజయకేతనం

దక్షిణ భారత సినీనటుల సంఘం ఎన్నికల్లో విశాల్ టీం దుమ్ము రేపింది. ప్రత్యర్థి ప్యానల్‌ను చిత్తుగా ఓడించింది. నడిగర్ సంఘం అధ్యక్షుడుగా నాజర్, ప్రధాన కార్యదర్శిగా విశాఖ ఘన విజయం సాధించారు. నాజర్ తన ప్రత్యర్థి శరత్‌కుమార్‌పై 109 ఓట్ల తేడాతో విజయం సాధించారు. విశాల్ 307 ఓట్ల తేడాతో రాధారవిపై విజయకేతనం ఎగరవేశారు. ప్రధాన కార్యదర్శి పదవికి పోటిపడిన విశాల్‌కు 1445 ఓట్లు రాగా… ప్రత్యర్థి రాధారవికి 1113 ఓట్లు వచ్చాయి. అధ్యక్ష పదవి రేసులో […]

Advertisement
Update:2015-10-18 18:25 IST

దక్షిణ భారత సినీనటుల సంఘం ఎన్నికల్లో విశాల్ టీం దుమ్ము రేపింది. ప్రత్యర్థి ప్యానల్‌ను చిత్తుగా ఓడించింది. నడిగర్ సంఘం అధ్యక్షుడుగా నాజర్, ప్రధాన కార్యదర్శిగా విశాఖ ఘన విజయం సాధించారు.

నాజర్ తన ప్రత్యర్థి శరత్‌కుమార్‌పై 109 ఓట్ల తేడాతో విజయం సాధించారు. విశాల్ 307 ఓట్ల తేడాతో రాధారవిపై విజయకేతనం ఎగరవేశారు. ప్రధాన కార్యదర్శి పదవికి పోటిపడిన విశాల్‌కు 1445 ఓట్లు రాగా… ప్రత్యర్థి రాధారవికి 1113 ఓట్లు వచ్చాయి. అధ్యక్ష పదవి రేసులో నాజర్‌కు 1344 ఓట్లు వచ్చాయి. కోశాధికారిగానూ విశాల్ బలపరిచిన కార్తీ ఎన్నికయ్యారు. దీంతో విశాల్ వర్గం సంబరాల్లో మునిగితేలింది. రాత్రి బాగా పొద్దుపోయే దాకా కౌంటింగ్ జరిగింది. పోస్టల్‌ బ్యాలెట్ ఓట్లలో మినహా మరే రౌండ్‌లోనూ శరత్ కుమార్ వర్గం పై చేయి సాధించలేకపోయింది. పదేళ్లుగా నడిగర్ సంఘానికి శరత్కుమార్ బృందం కార్య నిర్వాహకవర్గంగా కొనసాగుతుంది. వీరి అధిపత్యాన్ని సవాల్ చేస్తూ విశాల్ బృందం బరిలో దిగింది. అన్నట్టుగానే శరత్‌కుమార్ హవాకు గండికొట్టేశారు విశాల్.

Tags:    
Advertisement

Similar News