చిరు చిత్రంపై వర్మ సంచలన కామెంట్స్

ఎక్కడ చెడిందో గానీ మెగాఫ్యామిలీని ట్విట్టర్ వేదికగా రామ్ గోపాల్ వర్మ చికాకు పెడుతూనే ఉన్నారు. తాజాగా మరోసారి ట్విట్టర్‌లో చిరు 151 సినిమాపై తీవ్ర కామెంట్స్ చేశారు వర్మ. తమిళ చిత్రం ”కత్తి”ని చిరు రీమేక్ చేయబోతున్నారన్న వార్తల నేపథ్యంలో వర్మ కామెంట్స్ చేశారు. తమిళ సినిమాను రీమేక్ చేయడం అంటే తెలుగు ప్రజలకు చిరంజీవి వెన్నుపోటు పొడవడమేనని వ్యాఖ్యానించారు. ”కత్తి” చిత్రం రీమేక్ వార్తలు వదంతులు కావాలని తాను కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు. రాజమౌళి […]

Advertisement
Update:2015-10-17 06:29 IST

ఎక్కడ చెడిందో గానీ మెగాఫ్యామిలీని ట్విట్టర్ వేదికగా రామ్ గోపాల్ వర్మ చికాకు పెడుతూనే ఉన్నారు. తాజాగా మరోసారి ట్విట్టర్‌లో చిరు 151 సినిమాపై తీవ్ర కామెంట్స్ చేశారు వర్మ. తమిళ చిత్రం ”కత్తి”ని చిరు రీమేక్ చేయబోతున్నారన్న వార్తల నేపథ్యంలో వర్మ కామెంట్స్ చేశారు.

తమిళ సినిమాను రీమేక్ చేయడం అంటే తెలుగు ప్రజలకు చిరంజీవి వెన్నుపోటు పొడవడమేనని వ్యాఖ్యానించారు. ”కత్తి” చిత్రం రీమేక్ వార్తలు వదంతులు కావాలని తాను కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు. రాజమౌళి తెలుగువారి సత్తా చాటుతుంటే చిరంజీవి ఇలా తమిళ చిత్రాన్ని దిగుమతి చేసుకోవడం తెలుగు ప్రజలకు అవమానకరమన్నారు.

చిత్ర పరిశ్రమలో అసలైన బ్రూస్ లీ రాజమౌళియేనని కితాబు ఇచ్చారు. మెగా ఫ్యాన్స్ కూడా తెలుగు కథతోనే సినిమా తీసేలా చిరుపై ఒత్తిడి తేవాలని సలహా కూడా ఇచ్చేశారు వర్మ. చిరు బ్రూస్‌లీ చిత్రంలో నటించడం, ప్రజారాజ్యం పార్టీ పెట్టడం లాంటి తప్పిదమేనంటూ పుండుపై కారం చల్లారు. అయితే 151 చిత్రం మాత్రం ఎంటర్ ది డ్రాగన్ కావాలని కోరుకుంటున్నానని వర్మ ట్వీట్ చేశారు.

Tags:    
Advertisement

Similar News