బ్రూస్ లీ సక్సెస్ రేంజ్ ను తగ్గించినవి ఇవే..!
ఈ సినిమా కోసం డిజైన్ చేసుకున్న పాత్రలు కొత్తవైనా.. స్టోరీ మాత్రం చాలా పాతది. అలాగే ఆ మూల కథని స్టార్ రైటర్స్ అయిన కోన వెంకట్ అండ్ గోపి మోహన్‌లు కలిసి డెవలప్ చేసింది చాలా ఓల్డ్ ఫార్మాట్‌లో ఉంది. కథ పరంగా కొత్తదనం లేదు.. కానీ ఆ రేంజ్‌లో రాసుకోలేదు. ఫస్టాఫ్ పరంగా బాగానే డీల్ చేసినా, ట్విస్ట్‌ని ఇంటర్వెల్‌లోపే రివీల్ చేయడం సెకండాఫ్‌లో టర్నింగ్ పాయింట్స్ లేమీలేవు. సెకండాఫ్ మొత్తాన్ని కామెడీ పెట్టి […]
ఈ సినిమా కోసం డిజైన్ చేసుకున్న పాత్రలు కొత్తవైనా.. స్టోరీ మాత్రం చాలా పాతది. అలాగే ఆ మూల కథని స్టార్ రైటర్స్ అయిన కోన వెంకట్ అండ్ గోపి మోహన్‌లు కలిసి డెవలప్ చేసింది చాలా ఓల్డ్ ఫార్మాట్‌లో ఉంది. కథ పరంగా కొత్తదనం లేదు.. కానీ ఆ రేంజ్‌లో రాసుకోలేదు. ఫస్టాఫ్ పరంగా బాగానే డీల్ చేసినా, ట్విస్ట్‌ని ఇంటర్వెల్‌లోపే రివీల్ చేయడం సెకండాఫ్‌లో టర్నింగ్ పాయింట్స్ లేమీలేవు. సెకండాఫ్ మొత్తాన్ని కామెడీ పెట్టి మేనేజ్ చేయాలని అనుకున్నా అది పూర్తిగా ఫెయిల్ అయ్యింది. ఒక్క క్లైమాక్స్ తప్ప మిగతా సెకండాఫ్ బోరింగ్‌గా అనిపిస్తుంది. కామెడీ పెద్దగా వర్కౌట్ కాకపోవడం మరో బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. శ్రీను వైట్ల సినిమా అంటే కామెడీ బీభత్సంగా వుంటుంది.
ఈ సినిమాలో అదే మైనస్ అయ్యింది.
బ్రహ్మానందం కామెడీ అస్సలు వర్కౌట్ కాలేదు. సెకండాఫ్‌లో హీరోయిన్ పాటల కోసం తప్ప ఇంకెక్కడా పెద్దగా కనిపించదు. బాలీవుడ్ నటి టిసిక చోప్రా చేత చేయించిన రోల్ చాలా సిల్లీగా అనిపిస్తుంది. వీటన్నిటికీ మించి హీరో స్ట్రాంగ్ అంటే విలన్ అంతకన్నా స్ట్రాంగ్‌గా ఉండాలి. రెండే రెండు సీన్స్‌లో హీరోకి ఎదురుపడి ఒకసారి దెబ్బలు తిని కోమాలోకి, ఇంకోసారి చచ్చిపోతాడు అరుణ్ విజయ్. దీనివల్ల విలనిజం ఎలివేట్ కాలేదు. అలాగే సినిమా ప్రమోషన్స్‌లో చెప్పుకుంటూ వచ్చిన సిస్టర్ సెంటిమెంట్ కూడా పెద్దగా లేకపోవడం మరో మైనస్.ఇలా బ్రూస్ లీ లో బిగుతైన కథనం లేకుండా చుట్టేశారు మరి.