తెలంగాణ మలిదశ ఉద్యమానికి గద్దర్ పిలుపు
ప్రజాస్వామిక, సామాజిక తెలంగాణ కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని ప్రజా కళాకారుడు గద్దర్ పిలుపు ఇచ్చారు. భౌగోళిక తెలంగాణ వచ్చినంత మాత్రాన ప్రజలందరికీ మేలు జరగదని ఆయన అన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం కమ్మ, రెడ్డి వర్గాల పాలనలో ఉండేదని, ఇపుడు సాధించామని చెప్పుకుంటున్న భౌగోళిక తెలంగాణ రాష్ట్రం వెలమ, రెడ్డి వర్గాల మధ్య అధికార పోరాటంలా కనిపిస్తోందని, దీనివల్ల ప్రజలకు ఏ మాత్రం మేలు జరగదని గద్దర్ అన్నారు. సామాజిక తెలంగాణ సాధన కోసం […]
Advertisement
ప్రజాస్వామిక, సామాజిక తెలంగాణ కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని ప్రజా కళాకారుడు గద్దర్ పిలుపు ఇచ్చారు. భౌగోళిక తెలంగాణ వచ్చినంత మాత్రాన ప్రజలందరికీ మేలు జరగదని ఆయన అన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం కమ్మ, రెడ్డి వర్గాల పాలనలో ఉండేదని, ఇపుడు సాధించామని చెప్పుకుంటున్న భౌగోళిక తెలంగాణ రాష్ట్రం వెలమ, రెడ్డి వర్గాల మధ్య అధికార పోరాటంలా కనిపిస్తోందని, దీనివల్ల ప్రజలకు ఏ మాత్రం మేలు జరగదని గద్దర్ అన్నారు. సామాజిక తెలంగాణ సాధన కోసం కవులు, కళాకారులు కీలకపాత్ర పోషించాలని, ఉద్యమం సజీవంగా ఉంచడానికి దారి చూపాలని కోరారు. మలిదశ ఉద్యమానికి భువనగిరి నుంచే నాంది పలకాలని గద్దర్ పిలుపు ఇచ్చారు. సాహిత్యంలో భిన్న ధోరణులున్నా, సామాజిక దృక్ఫథంలో ఏకం కావాలని, దీనివల్ల ప్రజలకు మేలు జరుగుతుందని గద్దర్ హితవు చెప్పారు.
Advertisement