వయసు 73.. మనసు పాతికే..!
బిగ్ బి అమితాబచ్చన్ ను చూస్తే నిజంగా 72 సంవత్సరాల వయసు పూర్తి చేసుకున్నారా అనిపిస్తుంది. నటుడిగా బాలీవుడ్ లో ఆయన చేసినన్ని ప్రయోగాలు ఎవరు చేయలేదంటే అతిశయోక్తికాదు. కెరీర్ ప్రారంభంలో గేడి కొంగలా వున్నాడు ఇతనొక హీరోనా.. అని ఎద్దేవా చేసినా వాళ్లకు తన టాలెంట్ తో తన గొప్పతనం ఏమిటో నిరూపించాడు. ఇక షోలే , దివార్, జంజీర్, అగ్నిఫధ్ చిత్రాలతో అమితాబ్ బాలీవుడ్ సూపర్ స్టార్ అయ్యారు. ఏడు […]
Advertisement
బిగ్ బి అమితాబచ్చన్ ను చూస్తే నిజంగా 72 సంవత్సరాల వయసు పూర్తి చేసుకున్నారా అనిపిస్తుంది. నటుడిగా బాలీవుడ్ లో ఆయన చేసినన్ని ప్రయోగాలు ఎవరు చేయలేదంటే అతిశయోక్తికాదు. కెరీర్ ప్రారంభంలో గేడి కొంగలా వున్నాడు ఇతనొక హీరోనా.. అని ఎద్దేవా చేసినా వాళ్లకు తన టాలెంట్ తో తన గొప్పతనం ఏమిటో నిరూపించాడు. ఇక షోలే , దివార్, జంజీర్, అగ్నిఫధ్ చిత్రాలతో అమితాబ్ బాలీవుడ్ సూపర్ స్టార్ అయ్యారు. ఏడు పదులు వయసు నిండినా..నిత్య యవ్వనుడిలా కనిపిస్తూ.. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇక తనయుడు ఛోటా బచ్చన్ తండ్రి అడుగు జాడల్లో నడవటానికి ప్రయత్నిస్తున్నారు. అమితాబ్ ఒక హియలయా శిఖరం. దీంతో కొడుకు ఎంత చేసినా.. ఆయన తో పోల్చినప్పుడు.. సరి రాదు. ఇక కోడలు ఐశ్వర్య రాయ్.. అంతర్జాతీయ ఖ్యాతి ఉన్న నటిగా ప్రశంసలు పొందుతున్నారు.
నటుడిగా ఇంత కాలం తను కొన సాగటానికి వైవిధ్యమే కారణం అన్నారు. సోసల్ నెట్ వర్క్ లో అమితాబ్ కు ఆయన అభిమానులు బర్త్ డే ట్విట్స్ చేస్తున్నారు. అమితాబ్ సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్లు జీవించాలని కాంక్షిస్తూ తెలుగు గ్లోబల్ తరుపున జన్మదిన శుభాకాంక్షలు .
Advertisement