తాగేసి కొట్టిన అమ్మ రాజశేఖర్ ?

డ్యాన్స్ మాస్టర్ అమ్మ రాజశేఖర్‌పై  పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు  నమోదైంది.  మద్యం మత్తులో అమ్మ రాజశేఖర్ అతడి స్నేహితులు తనను కొట్టారంటూ  కింది అంతస్తులో నివాసముండే ఓ వ్యక్తి రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టీవీ సౌండ్ తగ్గించమని కోరినందుకు దాడి చేశారని ఫిర్యాదుదారుడు చెబుతున్నాడు. అయితే అమ్మ రాజశేఖర్ వాదన మరోలా ఉంది. గతంలో తాను ఇంట్లో లేని సమయంలో కింద నివాసముండే వ్యక్తి వచ్చి తన డ్రైవర్‌ను కొట్టి వెళ్లాడని అమ్మ రాజశేఖర్ […]

Advertisement
Update:2015-10-09 00:36 IST

డ్యాన్స్ మాస్టర్ అమ్మ రాజశేఖర్‌పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మద్యం మత్తులో అమ్మ రాజశేఖర్ అతడి స్నేహితులు తనను కొట్టారంటూ కింది అంతస్తులో నివాసముండే ఓ వ్యక్తి రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టీవీ సౌండ్ తగ్గించమని కోరినందుకు దాడి చేశారని ఫిర్యాదుదారుడు చెబుతున్నాడు. అయితే అమ్మ రాజశేఖర్ వాదన మరోలా ఉంది.

గతంలో తాను ఇంట్లో లేని సమయంలో కింద నివాసముండే వ్యక్తి వచ్చి తన డ్రైవర్‌ను కొట్టి వెళ్లాడని అమ్మ రాజశేఖర్ చెబుతున్నారు. దీనిపై నిలదీస్తే అతడే తన స్నేహితులను వెంటేసుకుని దాడి చేసేందుకు వచ్చాడని చెబుతున్నాడు. తన డ్రైవర్‌పై దాడి చేసే హక్కు అతడికి ఎక్కడిదని ప్రశ్నిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అసలు ఏం జరిగిందన్న దానిపై విచారణ జరుపుతున్నారు.

Tags:    
Advertisement

Similar News