వర్మను చంపిన పవన్ ఫ్యాన్స్! 

సంచనల దర్శకుడు రాంగోపాల్ వర్మను చంపేశారు. అవును నిత్యం వివాదాలతో ఆడుకునే వర్మను పవన్ అభిమానులు ట్విట్టర్ లో చంపేశారు. పవన్ ఫాలోవర్స్ మహేష్ ఫాలోవర్స్ కంటే తక్కువే వున్నారని, పవన్ అభిమానులకు టెక్నాలజీ గురించి పెద్దగా తెలియదని, రైతుల గురించి పవన్ పోరాడే బదులు ఫ్యాన్స్‌ని ఎడ్యుకేట్ చేయొచ్చు కదా అంటూ వర్మ ట్విట్టర్ లో పోస్ట్ లు పెట్టారు. దీనికి పవన్ ఫ్యాన్స్ ఘాటుగా సమాధానం ఇచ్చారు.  సినీ పరిశ్రమకు వర్మ పీడ తొలగిపోయిందని.. […]

Advertisement
Update:2015-10-07 00:36 IST
సంచనల దర్శకుడు రాంగోపాల్ వర్మను చంపేశారు. అవును నిత్యం వివాదాలతో ఆడుకునే వర్మను పవన్ అభిమానులు ట్విట్టర్ లో చంపేశారు. పవన్ ఫాలోవర్స్ మహేష్ ఫాలోవర్స్ కంటే తక్కువే వున్నారని, పవన్ అభిమానులకు టెక్నాలజీ గురించి పెద్దగా తెలియదని, రైతుల గురించి పవన్ పోరాడే బదులు ఫ్యాన్స్‌ని ఎడ్యుకేట్ చేయొచ్చు కదా అంటూ వర్మ ట్విట్టర్ లో పోస్ట్ లు పెట్టారు. దీనికి పవన్ ఫ్యాన్స్ ఘాటుగా సమాధానం ఇచ్చారు.
సినీ పరిశ్రమకు వర్మ పీడ తొలగిపోయిందని.. ఆనంద భాష్పాలతో ఆయనకు వీడ్కోలు.. నివాళులు అర్పిస్తున్న సినీ లోకం అంటూ ట్విట్టర్ లో వర్మ ఫొటో పెట్టి ట్వీట్లు చేశారు. వర్మకు తగిన బుద్ధి చెప్పాలనే తామీ ప్రచారం చేపట్టినట్టు పవన్ ఫ్యాన్స్ చెబుతున్నారు. అయితే ఈ విషయంపై వర్మ కూడా అంతే స్పీడ్ గా స్పందించారు.
చదువురాని, టెక్నికల్ నాలెడ్జ్ లేని వికలాంగులైన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అంటూ వారిని సంబోధించాడు. మీరు సోషల్ సైట్లలో నన్ను చంపగలరు కానీ.. నా ఆలోచనలను చంపలేరంటూ కౌంటర్ ఇచ్చాడు. అంతటితో ఆగకుండా మహేష్ బాబు ఫ్యాన్స్ ను కూడా ఈ వివాదంలోకి లాగాడు. నేను ఇంగ్లీష్ లో పెట్టిన ట్వీట్ పవన్ అభిమానులకు అర్థం కాదని… మహేష్ ఫ్యాన్స్ ఆ అర్థాన్ని తెలుగులో వారికి చెప్పండంటూ కామెంట్ పోస్ట్ చేశాడు. మొత్తం మీద ట్విట్టర్ వేదికగా వర్మకు పవన్ అభిమానులకు మధ్య హాట్ హాట్ కామెంట్స్ వార్ నడుస్తోంది.
Tags:    
Advertisement

Similar News