రిలీజ్ కు ముందే అఖిల్ కు షాక్

అఖిల్ సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేసేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది అక్కినేని కాంపౌండ్. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను తెరకెక్కించింది. నితిన్-నాగార్జున సంయుక్తంగా తెరకెక్కించిన అఖిల్ సినిమా ఆడియోను కూడా అంతే గ్రాండ్ గా విడుదల చేశారు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఒక్క ఎదురుదెబ్బ కూడా తగల్లేదు. కానీ ఫస్ట్ టైమ్.. అఖిల్ కు జర్క్ తగిలింది. అది కూడా సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు ఈ జర్క్ తగలడంతో అఖిల్ […]

Advertisement
Update:2015-10-07 00:34 IST
అఖిల్ సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేసేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది అక్కినేని కాంపౌండ్. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను తెరకెక్కించింది. నితిన్-నాగార్జున సంయుక్తంగా తెరకెక్కించిన అఖిల్ సినిమా ఆడియోను కూడా అంతే గ్రాండ్ గా విడుదల చేశారు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఒక్క ఎదురుదెబ్బ కూడా తగల్లేదు. కానీ ఫస్ట్ టైమ్.. అఖిల్ కు జర్క్ తగిలింది. అది కూడా సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు ఈ జర్క్ తగలడంతో అఖిల్ యూనిట్ షాక్ కు గురైంది. తాజా సమాచారం ప్రకారం, అఖిల్ సినిమా డిస్ట్రిబ్యూషన్ నుంచి ఓ భారీ కంపెనీ తప్పుకున్నట్టు తెలుస్తోంది. అత్యంత కీలకమైన నిజాం ఏరియా పంపిణీ నుంచి ఆర్ ఎస్ ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ తప్పుకున్నట్టు తెలుస్తోంది. అఖిల్ సినిమాకు అంత డబ్బుపెట్టి పంపిణీ హక్కులు కొనడం ఇష్టంలేకనే ఆ సంస్థ తప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక వాస్తవం అయితే మిగతా ఏరియాల నుంచి అఖిల్ సినిమాపై వత్తిడి పెరగడం ఖాయం. ఇప్పటికే ఈ సినిమా 48కోట్ల రూపాయల ప్రీ-బిజినెస్ చేసింది. ఆర్ ఎస్ సంస్థ తప్పుకోవడంతో.. ఆ ఎఫెక్ట్ బిజినెస్ పై పడే ప్రభావం ఉంది.
Tags:    
Advertisement

Similar News