హీరో త‌నీశ్‌కు కోర్టు జ‌రిమానా!

రాత్రిపూట రోడ్డుపై గొడ‌వ చేసి న్యూసెన్స్ కు పాల్ప‌డిన కేసులో తెలుగు యువ హీరో త‌నీశ్‌కు నాంప‌ల్లి కోర్టు రూ.50 జ‌రిమానా విధించింది. గ‌త‌వారం బంజారాహిల్స్ రోడ్ నెం.45లో త‌నీశ్ కారును వెన‌క నుంచి వ‌చ్చిన ఓ బైక్ ఢీకొట్టింది. దీంతో కారు దిగిన త‌నీశ్ అత‌నితో గొడ‌వ‌ప‌డ్డాడు. ఆ వ్య‌క్తిపై నానా దుర్భాష‌లాడాడు. వీరి గొడ‌వ కాస్త సీరియ‌స్ కావ‌డంతో పోలీసులు వ‌చ్చారు. ఇద్ద‌రిపై న్యూసెన్స్ కేసులు న‌మోదు చేశారు. ఈ కేసులో సోమ‌వారం నాంప‌ల్లి […]

Advertisement
Update:2015-10-06 00:33 IST

రాత్రిపూట రోడ్డుపై గొడ‌వ చేసి న్యూసెన్స్ కు పాల్ప‌డిన కేసులో తెలుగు యువ హీరో త‌నీశ్‌కు నాంప‌ల్లి కోర్టు రూ.50 జ‌రిమానా విధించింది. గ‌త‌వారం బంజారాహిల్స్ రోడ్ నెం.45లో త‌నీశ్ కారును వెన‌క నుంచి వ‌చ్చిన ఓ బైక్ ఢీకొట్టింది. దీంతో కారు దిగిన త‌నీశ్ అత‌నితో గొడ‌వ‌ప‌డ్డాడు. ఆ వ్య‌క్తిపై నానా దుర్భాష‌లాడాడు. వీరి గొడ‌వ కాస్త సీరియ‌స్ కావ‌డంతో పోలీసులు వ‌చ్చారు. ఇద్ద‌రిపై న్యూసెన్స్ కేసులు న‌మోదు చేశారు. ఈ కేసులో సోమ‌వారం నాంప‌ల్లి క్రిమిన‌ల్‌ కోర్టుకు హాజ‌రైన‌ హీరో త‌నీశ్ కు రూ.50 జ‌రిమానా విధించింది. తెలుగు ఇండస్ట్రీలో ప‌లువురు సినీప్ర‌ముఖులు డ్రంకెన్ డ్రైవ్ ల సంద‌ర్భంగా ప‌ట్టుబ‌డ్డ సంగ‌తి తెలిసిందే! కానీ, తొలిసారిగా న్యూసెన్స్ కేసులో ఓ హీరోపై కేసులు న‌మోద‌వ‌డం, కోర్టు జ‌రిమానా విధించడం మాత్రం ఇదే తొలిసారి!

Tags:    
Advertisement

Similar News