ధోనీ అనంతపురానికి రావాలి: కోర్టు
భారత వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి అనంతపురం జిల్లా కోర్టు సమన్లు జారీ చేసింది. నవంబరు 7లోగా న్యాయస్థానానికి హాజరుకావాలని ఆదేశించింది. 2013లో బిజినెస్ టుడే పత్రికపై ధోనీకి చెందిన వివాదాస్పద ముఖచిత్రం ప్రచురితమైంది. దీనిపై వీహెచ్‌పీతోపాటు పలు హిందూ ధార్మిక సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. విష్ణు మూర్తి అవతారంలో ఉన్న ధోనీ చేతుల్లో బూస్ట్, పెప్సీ, బూట్లు ఇతర వాణిజ్య వస్తువులు ఉన్నాయి. దీనిపై పలు ఆధ్యాత్మిక సంఘాలు […]
భారత వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి అనంతపురం జిల్లా కోర్టు సమన్లు జారీ చేసింది. నవంబరు 7లోగా న్యాయస్థానానికి హాజరుకావాలని ఆదేశించింది. 2013లో బిజినెస్ టుడే పత్రికపై ధోనీకి చెందిన వివాదాస్పద ముఖచిత్రం ప్రచురితమైంది. దీనిపై వీహెచ్‌పీతోపాటు పలు హిందూ ధార్మిక సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. విష్ణు మూర్తి అవతారంలో ఉన్న ధోనీ చేతుల్లో బూస్ట్, పెప్సీ, బూట్లు ఇతర వాణిజ్య వస్తువులు ఉన్నాయి. దీనిపై పలు ఆధ్యాత్మిక సంఘాలు దేశంలోని పలు కోర్టుల్లో వ్యాజ్యాలు దాఖలు చేశాయి. తాజాగా అనంతపురానికి చెందిన విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు యర్రగుంట్ల శ్యాం సుందర్ స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన కోర్టు పత్రిక ఎడిటర్, క్రికెటర్ ధోనీ అరెస్టుకు వారెంట్ జారీ చేసింది. నవంబరు 7న కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకావాలని జిల్లా న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.