సాగరమాలతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం: చంద్రబాబు

సాగరమాల ప్రాజెక్టుతో రవాణా వ్యవస్థ మెరుగుపడుతుందని… దీని ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. సోమవారం షిప్పింగ్,రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆధ్వర్యంలో సాగరమాల ప్రాజెక్టుపై జరిగిన సమావేశంలో బాబు మాట్లాడుతూ మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలోనే ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగినా కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ఈ ప్రాజెక్టును మళ్లీ చేపట్టినందుకు మోడీని జాతి గుర్తు పెట్టుకుంటుందని అన్నారు. తీర ప్రాంతాల అభివృద్ధి […]

Advertisement
Update:2015-10-05 10:34 IST

సాగరమాల ప్రాజెక్టుతో రవాణా వ్యవస్థ మెరుగుపడుతుందని… దీని ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. సోమవారం షిప్పింగ్,రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆధ్వర్యంలో సాగరమాల ప్రాజెక్టుపై జరిగిన సమావేశంలో బాబు మాట్లాడుతూ మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలోనే ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగినా కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ఈ ప్రాజెక్టును మళ్లీ చేపట్టినందుకు మోడీని జాతి గుర్తు పెట్టుకుంటుందని అన్నారు. తీర ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ‘సాగరమాల’ ప్రాజెక్టు అపెక్స్ కమిటీకిది మొదటి సమావేశం.

తెలంగాణలో రెండు… ఆంధ్రలో ఒకటి
గడిచిన 30 ఏళ్లలో కేవలం ఐదింటిని మాత్రమే జాతీయ జల రవాణా మార్గాలను గుర్తించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ-పుదుచ్చేరి మార్గంలో 1,078 కి.మీ. మేర జల మార్గం ఒకటి. కేంద్రం తాజాగా మరో 101 జాతీయ జల రవాణా మార్గాలను అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రెండు మార్గాలకు చోటు దక్కింది. కృష్ణా నదిలో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల మీదుగా ఒక జాతీయ జల మార్గం, మంజీరా నదిలో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మీదుగా మరో మార్గాన్ని కేంద్రం అభివృద్ధి చేయనుంది.

Tags:    
Advertisement

Similar News