బుల్లితెరపై కాసులు కురిపించనున్న బాహుబలి
వెండితెరపై ఇప్పటికే ప్రభంజనం సృష్టించింది బాహుబలి సినిమా. ప్రపంచవ్యాప్తంగా 6 వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. ఇప్పుడీ ఎపిక్ మూవీ బుల్లితెరపై కూడా సంచలనాలకు సిద్ధమౌతోంది. దాదాపు 20 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ సినిమా శాటిలైట్ రైట్స్ దక్కించుకుంది మాటీవీ. దసరా కానుకగా బాహుబలి సినిమాను బుల్లితెర ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధమౌతోంది. ఈ సినిమాతో టీవీ హిస్టరీలోనే ఓ చరిత్ర సృష్టించబోతోంది బాహుబలి. రేటింగ్స్ పరంగానే కాకుండా రెవెన్యూ పరంగా కూడా ఇది సరికొత్త మార్కెట్ […]
Advertisement
వెండితెరపై ఇప్పటికే ప్రభంజనం సృష్టించింది బాహుబలి సినిమా. ప్రపంచవ్యాప్తంగా 6 వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. ఇప్పుడీ ఎపిక్ మూవీ బుల్లితెరపై కూడా సంచలనాలకు సిద్ధమౌతోంది. దాదాపు 20 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ సినిమా శాటిలైట్ రైట్స్ దక్కించుకుంది మాటీవీ. దసరా కానుకగా బాహుబలి సినిమాను బుల్లితెర ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధమౌతోంది. ఈ సినిమాతో టీవీ హిస్టరీలోనే ఓ చరిత్ర సృష్టించబోతోంది బాహుబలి. రేటింగ్స్ పరంగానే కాకుండా రెవెన్యూ పరంగా కూడా ఇది సరికొత్త మార్కెట్ ను సృష్టించనుంది. ఇప్పటికే బాహుబలి ప్రీమియర్ లో యాడ్స్ కోసం తీవ్రంగా పోటీ ఉంది. కార్పొరేట్ కంపెనీలతో పాటు చాలా సంస్థలు బాహుబలి సినిమా టైమ్ లో తమ యాడ్ ను టెలికాస్ట్ చేసేందుకు ఎగబడుతున్నాయి. కేవలం 10 సెకెన్ల యాడ్ కు రెండున్నర లక్షలు చార్జ్ చేస్తున్నట్టు సమాచారం. ఇలా చూసుకుంటే.. బాహుబలి సినిమా బుల్లితెరపై కూడా వసూళ్ల వర్షం కురిపించడం ఖాయం. మరోవైపు దసరా రోజునే అన్ని భాషల్లో బాహుబలి సినిమాను స్టార్ టీవీలో ప్రసారం చేయబోతుండడం మరో విశేషం.
Advertisement