న్యాయం కోసం సుప్రీంకోర్టుకు 6నెలల చిన్నారులు

భారత న్యాయవ్యవస్థలో అరుదైన ఘట్టం నమోదైంది. సుప్రీంకోర్టు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓ స్పెషల్ పిటిషన్ దాఖలైంది. దేశ న్యాయవ్యవస్థలో మొట్టమెదటి సారిగా ముగ్గురు అతి చిన్న వయసు చిన్నారులు అత్యున్నత న్యాయస్థానం కోర్టు మెట్లు ఎక్కారు. తమను కాలుష్యం బారి నుంచి కాపాడాలంటూ ఢిల్లీకి చెందిన ఆరు నెలల అర్జున్ గోపాల్, అరవ్ భండారి మరియు 14నెలల జోయారావు తరుఫున వారి సంరక్షకులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21  ప్రకారం స్వచ్ఛమైన […]

Advertisement
Update:2015-10-01 05:10 IST

భారత న్యాయవ్యవస్థలో అరుదైన ఘట్టం నమోదైంది. సుప్రీంకోర్టు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓ స్పెషల్ పిటిషన్ దాఖలైంది. దేశ న్యాయవ్యవస్థలో మొట్టమెదటి సారిగా ముగ్గురు అతి చిన్న వయసు చిన్నారులు అత్యున్నత న్యాయస్థానం కోర్టు మెట్లు ఎక్కారు. తమను కాలుష్యం బారి నుంచి కాపాడాలంటూ ఢిల్లీకి చెందిన ఆరు నెలల అర్జున్ గోపాల్, అరవ్ భండారి మరియు 14నెలల జోయారావు తరుఫున వారి సంరక్షకులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే హక్కును తమకు కల్పించమంటూ పిటిషన్ దాఖలు చేశారు.
దసరా, దీపావళి పండగల సమయాల్లో మందుగుండు పేల్చడం వల్ల శబ్ధ, వాయు కాలుష్యం పెరుగుతోందని, క్రాకర్స్ ను బ్యాన్‌ చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని చిన్నారుల తరుఫున పిటీషన్‌లో కోరారు. టపాసుల నుంచి వెలువడే కాలుష్యం కారణంగా తమ ఊపిరితిత్తులపై ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సంపూర్ణ ఆరోగ్యంతో పెరిగి తమ భవిష్యత్తును కాపాడుకోవాలంటే టపాలసులపై నిషేధం విధించాలని చిన్నారులు పిటీషన్‌ వేశారు.
అంతేకాదు మన రోడ్లపై నడుపుతున్న వాహనాలు సరైన నిబంధనలు పాటించడం లేదని పిటిషన్ లో స్పష్టం చేశారు. నగరాల్లో పేరుకపోతున్న చెత్త, కాంక్రీట్‌ వేస్టేజ్ కారణంగా ఆరోగ్యాలు పాడవుతున్న విషయాన్ని వారు ప్రస్తావించారు. చిన్నారులు వేసిన ఈ పిటిషన్ ఇప్పుడు సుప్రీంకోర్టులోనూ తీవ్ర చర్చకు దారితీసింది. చిన్నపిల్లల తరుఫున దాఖలు చేసిన పిటిషన్‌ ను ధర్మాసనం స్వీకరిస్తుందా? లేదా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే న్యాయ నిపుణులు మాత్రం అలాంటి అనుమానాలు అవసరం లేదంటున్నారు.
ఆరు నెలల చిన్నారుల తరుఫున పిటిషన్ లు రావడం కోర్టు చరిత్రలోనే తొలిసారని వ్యాఖ్యానించారు. అయితే వారి తరుఫున దాఖలైన పిటిషన్ లు నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయంటున్నారు. చిన్నారుల పిటీషన్‌ను విచారించడానికి మార్గదర్శకాలు అనుమతిస్తాయని చెబుతున్నారు. పిల్లలు తమ హక్కులను కాపాడుకోవడానికి వారి తరపున పేరేంట్స్‌, సంరక్షకులు లేదా స్నేహితులు
కోర్టులో పిటిషన్ వేయడానికి చట్టం అనుమతి ఇస్తుందన్న వాదన ఉంది. అయితే ఇవన్నీ పూర్తిస్థాయిలో పరిశీలించిన జరిపిన తర్వాతే చిన్నారుల చేత పిటీషన్‌ వేయించినట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేసు ఎవరు వేశారన్న దాన్ని తక్కన పెడితే.. ఈ పిటిషన్ విచారణకు వస్తుందా? రాదా అన్నది చర్చనీయాంశమైంది. పిటిషన్‌ దాఖలైన సమయంలోనే సంచలనం సృష్టించిని చిన్నారుల వ్యవహారం రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. .

Tags:    
Advertisement

Similar News