చిరంజీవికి అక్కడ కాలింది...!

చిరంజీవికి మృధు స్వభావి అనే పేరుంది. కాని ఆయన తనయుడు రామ్‌చరణ్‌ కూడా అలాగే ఉండాలని లేదు కదా! కొడుకులు ఎదిగిన తర్వాత నిర్ణయాల్లో తండ్రుల పాత్ర తగ్గిపోతుంది. చిరంజీవి కుటుంబం కూడా ఇందుకు అతీతం కాదు. ఇది సహజ పరిణామ క్రమం కూడా. అందుకే చిరంజీవి 150వ సినిమా విషయాన్ని చిరంజీవి కన్నాముందే రామ్‌చరణ్‌ ప్రకటించేశాడు. అంతటితో ఆగిపోయాడా? లేదు… దానికి పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తాడని కూడా చరణే చెప్పేశాడు. దీంతో పూరి ఉబ్బితబ్బిబయిపోయి […]

Advertisement
Update:2015-09-28 05:30 IST
చిరంజీవికి మృధు స్వభావి అనే పేరుంది. కాని ఆయన తనయుడు రామ్‌చరణ్‌ కూడా అలాగే ఉండాలని లేదు కదా! కొడుకులు ఎదిగిన తర్వాత నిర్ణయాల్లో తండ్రుల పాత్ర తగ్గిపోతుంది. చిరంజీవి కుటుంబం కూడా ఇందుకు అతీతం కాదు. ఇది సహజ పరిణామ క్రమం కూడా. అందుకే చిరంజీవి 150వ సినిమా విషయాన్ని చిరంజీవి కన్నాముందే రామ్‌చరణ్‌ ప్రకటించేశాడు. అంతటితో ఆగిపోయాడా? లేదు… దానికి పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తాడని కూడా చరణే చెప్పేశాడు. దీంతో పూరి ఉబ్బితబ్బిబయిపోయి తన చేతిలో ఉన్న రెండు ప్రాజెక్టులను కూడా వదిలేశాడు. వాటికి తీసుకున్న రెండు కోట్ల అడ్వాన్సు కూడా తిరిగి ఇచ్చేశాడు. ఆ తర్వాత చిరంజీవికి కథ చెప్పేశాడు. ఆయన సూచన మేరకు ఆ కథను తమ్ముడు నాగబాబుకు కూడా వినిపించాడు. అక్కడి దాకా బాగానే జరిగింది. కథ ఓ.కే. అనుకున్నారు. టైటిల్‌ కూడా ఆటో జానీ అని నిర్ణయించేశారు. కథ క్లైమాక్స్‌లో ఉండగా… కథలో సెకండాఫ్‌ పెద్దగా నచ్చలేదని చిరంజీవి మీడియా ముందు కుండబద్దలుగొట్టారు. అదే పూరికి చెప్పి ఉండవచ్చు కదా! కాని అలా జరగలేదు. ఇదే పూరికి కొంచెం నొప్పి కలిగించింది. ఈ నొప్పికి కారణం ఏమిటని ఆరా తీస్తే దానికి వేర కథ ఉందని అర్ధమయ్యింది అదేమిటంటే… పూరి చిరంజీవి సినిమా ఒప్పుకున్న తర్వాత అదే యావలో ఉండకుండా ఎడాపెడా ఇతర సినిమాలకి కూడా కమిట్‌మెంట్లు ఇచ్చేస్తుండడం చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌కి కాలింది. ఈ నొప్పి పూరికి తాకిందన్న మాట!. అంటే స్వయంగా పూరియే కాల్చుకున్నాడన్న మాట. ఎందుకంటే చిరంజీవి ప్రాజెక్ట్ స్టోరీ ఖరారు కాకుండానే పూరి వేరే సినిమాలు అనేకం ప్రకటించేశారు. ఛార్మితో జ్యోతిలక్ష్మి, నితిన్‌తో ఒకటి, వరుణ్‌తేజ్‌తో ఒకటి ఇలా వరసగా ప్రకటించుకుంటూ పోవటం చిరు, చరణ్‌లను ఆగ్రహానికి గురిచేసింది. దానిని డైరెక్ట్‌గా చెప్పకుండా పూరి చాలా బిజీగా ఉన్నందువల్లే వేరే ఆలోచనలు చేస్తున్నామని మెల్లగా చెప్పారు. మెగా ప్రాజెక్టు భుజాన వేసుకున్న తర్వాత బుడ్డబుడ్డ ప్రాజెక్టులకు కమిట్‌మెంట్‌లివ్వడం ఆగ్రహం కలిగించడం సహజమే కదా!
Tags:    
Advertisement

Similar News