ప్ర‌స్తుత ల‌వ‌ర్ కోసం.. మాజీ ల‌వ‌ర్ ను బుక్ చేసిందా..!

బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, దీపిక పదుకోన్ మధ్య గతంలో లవ్ ఎఫైర్ నడిచిన సంగతి తెలిసిందే. అప్పట్లో వీరి వ్యవహారం దాదాపు పెళ్లి వరకు వెళ్లింది, కానీ జరుగలేదు. తర్వాత ఈ ఇద్దరూ ఎవరి దారి వారు చూసుకున్నారు. ఈ ఇద్దరు మాజీ లవర్స్ కలిసి తాజాగా ‘తమాషా’ అనే చిత్రంలో నటిస్తున్నారు. మంగళవారం జరిగిన ‘తమాషా’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో దీపిక షాకింగ్ కామెంట్స్ చేసింది. తన మాజీ లవర్ రణబీర్ ను ఏకంగా […]

Advertisement
Update:2015-09-23 07:30 IST

బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, దీపిక పదుకోన్ మధ్య గతంలో లవ్ ఎఫైర్ నడిచిన సంగతి తెలిసిందే. అప్పట్లో వీరి వ్యవహారం దాదాపు పెళ్లి వరకు వెళ్లింది, కానీ జరుగలేదు. తర్వాత ఈ ఇద్దరూ ఎవరి దారి వారు చూసుకున్నారు. ఈ ఇద్దరు మాజీ లవర్స్ కలిసి తాజాగా ‘తమాషా’ అనే చిత్రంలో నటిస్తున్నారు. మంగళవారం జరిగిన ‘తమాషా’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో దీపిక షాకింగ్ కామెంట్స్ చేసింది. తన మాజీ లవర్ రణబీర్ ను ఏకంగా అన్నయ్యా అనేసింది. ఎంత మాజీ లవర్ అయితే మాత్రం ఇలా అన్నయ్యా అనేయడం ఏమిటని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. కొందరైతే దీపికపై దుమ్మెత్తి పోస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం వాట్సాప్, ఫేస్ బుక్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో 90 రోజుల పాటు సందేశాలు డిలీట్ చేయకూడదు అనే ప్రతి పాదన తెస్తున్న నేపథ్యంలో….దీనిపై రణబీర్ కపూర్ స్పందిస్తూ ప్రేమికులు ఇకపై వాట్సాప్, ఫేస్ బుక్ ద్వారా అభ్యంతరకర సందేశాలు పంపుకోవద్దు బుక్ అయిపోతారు అంటూ అని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో పక్కనే ఉన్న దీపిక శభాష్ బ్రొ… అంటూ రణబీర్‌కు సపోర్ట్ ఇచ్చింది. ఉన్నట్టుండి రణబీర్ ను దీపిక బ్రొ… (బ్రదర్) అని వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది.

అయితే ప్ర‌స్తుతం ర‌ణ్వీర్ సింగ్ తో దీపిక డేటింగ్ చేస్తుంది. త‌న మాజీ ల‌వ‌ర్ తో క‌ల‌సి దీపిక ఇప్ప‌టికే రెండు సినిమాలు చేసేసింది. ఎంతైనా మాజి ల‌వ‌ర్స్ క‌దా.. తిరిగి ప్రేమ పొద్దు పొడిచే అవ‌కాశం వుంటుంద‌నే సందేహాం తాజా ల‌వ‌ర్ కు క‌ల‌గ‌కుండా.. మాజీల‌వ‌ర్ ను అన్న‌య్య అనేసి .. ప్ర‌స్తుత ల‌వ‌ర్ ర‌ణ్వీర్ సింగ్ కు ఏ విధ‌మైన సందేహాలు రేకెత్త‌కుండా దీపిక క్లారీటి ఇచ్చిందిలే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ విష‌యంలో ఎవ‌రి వెర్ష‌న్ వారిది మ‌రి.!

Tags:    
Advertisement

Similar News