బ్రూస్ లీ ఆడియోకి పవన్ ఎందుకు రాడంటే...?
పవన్ కళ్యాణ్ ను ఆడియో వేడుకులకు రప్పించడం అనేది అంత తేలికైన విషయం కాదు. ఎందుకు రప్పించలేరు..? రాంచరణ్ కు స్వయానా సొంత బాబాయ్.. మెగా స్టార్ చిరు నిర్మించిన ప్లాట్ ఫామ్ మీద ఎంట్రీ ఇచ్చి.. తన ఉనికిని చాటుకున్నాడు పవన్. నిజంగా చిరు పిలిస్తే పవన్ కళ్యాణ్ రాడా..? రాలేనంత గ్యాప్ వారిద్దరి మధ్య ఉందా..? అంతగా ఏముంది…? ఏమి లేదు. మరి అయితే తరచుగా జరుగుతున్న మెగా హీరోల […]
Advertisement
పవన్ కళ్యాణ్ ను ఆడియో వేడుకులకు రప్పించడం అనేది అంత తేలికైన విషయం కాదు. ఎందుకు రప్పించలేరు..? రాంచరణ్ కు స్వయానా సొంత బాబాయ్.. మెగా స్టార్ చిరు నిర్మించిన ప్లాట్ ఫామ్ మీద ఎంట్రీ ఇచ్చి.. తన ఉనికిని చాటుకున్నాడు పవన్. నిజంగా చిరు పిలిస్తే పవన్ కళ్యాణ్ రాడా..? రాలేనంత గ్యాప్ వారిద్దరి మధ్య ఉందా..? అంతగా ఏముంది…? ఏమి లేదు. మరి అయితే తరచుగా జరుగుతున్న మెగా హీరోల సినిమా ఆడియో వేడుకలకు పవన్ కళ్యాణ్ ఎందుకు రావడం లేదు..?
దీనిక ఆయన మద్దతుదారులు.. సన్నిహితుల నుంచి మంచి ఆన్సరే ఉంది మరి. ఎందుకంటే..పవన్ కళ్యాణ్ ఆడియో వేడుకలకు అతిథిగా వచ్చే స్టేజ్ ఎప్పుడో దాటేశారు. ప్రస్తుతం ఆయన జనసేన రాజకీయ పార్టీ అధినేత. ఆంధ్రాలో అధికార పార్టీకి మిత్రపక్షం. రాజకీయంగా ఆలోచనలు చేస్తున్నారు. మరో వైపు తన నుంచి అభిమానులు ఎప్పటీనుంచో ఆశిస్తున్న గబ్బర్ సింగ్ సీక్వెల్ ను కంప్లీట్ చేస్తున్నారు. క్షణం తీరక లేకుండా ఒక వ్యక్తి.. ఇటువంటి వేడుకలకు వచ్చి..కొన్ని గంటల సమయాన్ని వేస్ట్ చేసుకునే పరిస్థితిలో లేడు అనేది వారి సమాధానం. కరెక్టే కదా..? ఇప్పుడు మెగా హరోలకు పవన్ స్టార్ వస్తేనే బండి నడస్తుందా..? అందరు స్వయంగా తమకంటు ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచేసుకుంటున్నారు కదా..? సో అక్టోబర్ 2న రాంచరణ్ బ్రూస్ లీ సినిమా ఆడియో వేడుకకు పవన్ కళ్యాణ్ రావడం కష్టమే అని చెప్పడం అతిశయోక్తి కాదు మరి.! మరి మీరేమంటారు..!
Advertisement