షేర్ అయినా కిక్ ఇస్తుందా..
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా షేర్ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం మనందరికీ తెలిసిందే. పటాస్ తర్వాత భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ను కల్యాణ్ రామ్ ఫిక్స్ చేశాడు. అక్టోబర్ 30న షేర్ ను థియేటర్లలోకి తీసుకురావాలని భావిస్తున్నాడు. ఈ గ్యాప్ లో అక్టోబర్ 10న సినిమా పాటల్ని విడుదల చేయాలనుకుంటున్నాడు. తమన్ సంగీతం అందించిన షేర్ పాటల్ని.. హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో గ్రాండ్ గా విడుదల చేయాలని […]
Advertisement
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా షేర్ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం మనందరికీ తెలిసిందే. పటాస్ తర్వాత భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ను కల్యాణ్ రామ్ ఫిక్స్ చేశాడు. అక్టోబర్ 30న షేర్ ను థియేటర్లలోకి తీసుకురావాలని భావిస్తున్నాడు. ఈ గ్యాప్ లో అక్టోబర్ 10న సినిమా పాటల్ని విడుదల చేయాలనుకుంటున్నాడు. తమన్ సంగీతం అందించిన షేర్ పాటల్ని.. హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో గ్రాండ్ గా విడుదల చేయాలని నిర్ణయించారు. మల్లికార్జున్ డైరక్షన్ లో తెరకెక్కిన షేర్ సినిమాలో సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మరో 10 రోజుల్లో ఫస్ట్ కాపీ కూడా సిద్ధమైపోతుంది. తన సొంత బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాపై కల్యాణ్ రామ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. కిక్-2 నష్టాలను షేర్ కొంతలో కొంతయినా భర్తీ చేస్తుందని ఆశపడుతున్నాడు.
Advertisement