హీరో విశ్వక్ సేన్ ఇంట్లో చోరీ
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ భారీ దొంగతనం జరిగింది.;
టాలీవుడ్ యువ హీరో విశ్వక్ సేన్‌కు ఇంట్లో భారీ చోరీ జరిగింది.హైదరాబాద్ ఫిలింనగర్ రోడ్డు నెంబర్-8లోని విశ్వక్ సేన్ ఇంట్లోకి చొరబడిన ఓ దుండగుడు.. బంగారు ఆభరణాలు తీసుకుని పరారయ్యాడు. విశ్వక్ సేన్ సోదరి వన్మయి రూమ్‌లోని ఆల్మారాలో బంగారు ఆభరణాలు మాయమైనట్లు గుర్తించారు. విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇంట్లో భారీ చోరీ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
ఫిర్యాదును అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలను సేకరించారు. అలాగే ఇంటి చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. తెల్లవారుజామున 5:50 గంటల సమయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి బైక్‌పై వచ్చినట్టు కెమెరాల్లో రికార్డు అయింది. ఆ వ్యక్తి గేటు తెరిచి, నేరుగా మూడో అంతస్తుకు చేరుకుని, వెనుక ద్వారం గుండా వన్మయి బెడ్‌రూంలోకి ప్రవేశించినట్టు పోలీసులు గుర్తించారు. అక్కడ అల్మారాలో నుంచి బంగారు ఆభరణాలను దొంగిలించినట్టు తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం, ఆ దొంగ కేవలం 20 నిమిషాల్లోనే చోరీ పూర్తి చేసి, అక్కడి నుంచి పరారైనట్టు పోలీసులు నిర్ధారించారు.