సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తీవ్ర అస్వస్థత
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఆదివారం అస్వస్థతకు గురయ్యారు;
Advertisement
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అస్వస్థతకు గురయ్యారు. ఆకస్మాత్తుగా ఛాతీ నొప్పి రావడంతో చెన్నైలోని అపోలో ఆస్పుత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆయనకు ఎమర్జెన్సీ వార్డులో చేర్చి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు ఆయనకు ఈసీజీ, ఈకో కార్డియోగ్రామ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు రెహమాన్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయనకు వైద్య పరీక్షలు జరుగుతున్నట్లు వెల్లడించాయి. రెహమాన్ ను స్పెషలిస్టుల బృందం పరీక్షిస్తోందని, ఆయనకు యాంజియోగ్రామ్ నిర్వహించే అవకాశం ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
Advertisement