రణబీర్ తమాషాకు రంగం సిద్ధం
కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేని రణబీర్ కపూర్.. భారీ అంచనాల మధ్య చేస్తున్న చిత్రం తమాషా. ఈ మధ్యే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే ఉత్సాహంతో ఫస్ట్ ట్రయిలర్ కూడా విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. ఈనెల 22న తమాషా ట్రయిలర్ ను లాంచ్ చేస్తారు. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో రణబీర్-దీపిక పదుకోన్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోంది తమాషా చిత్రం. ఎప్పుడో ఒకే స్టోరీ ఎందుకు […]
Advertisement
కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేని రణబీర్ కపూర్.. భారీ అంచనాల మధ్య చేస్తున్న చిత్రం తమాషా. ఈ మధ్యే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే ఉత్సాహంతో ఫస్ట్ ట్రయిలర్ కూడా విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. ఈనెల 22న తమాషా ట్రయిలర్ ను లాంచ్ చేస్తారు. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో రణబీర్-దీపిక పదుకోన్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోంది తమాషా చిత్రం. ఎప్పుడో ఒకే స్టోరీ ఎందుకు అనే క్యాప్షన్ తో తమాషా చిత్రం తెరకెక్కుతోంది. అంటే ఈ కథ కచ్చితంగా కొత్తగా ఉండబోతోందని చెప్పకనే చెప్పారు. గతంలో ఇంతియాజ్ అలీతో రాక్ స్టార్ అనే హిట్ సినిమా చేశాడు రణబీర్. ఇప్పుడు తమాషాతో మరో సక్సెస్ పై కన్నేశాడు. సినిమాను నవంబర్ 27న విడుదల చేస్తారు.
Advertisement