గోపీచంద్ కొత్త సినిమా పేరేంటి..?

లౌక్యం, జిల్ లాంటి వరుస హిట్ సినిమాల తర్వాత అందరి దృష్టి గోపీచంద్ పై పడింది. ఈ హీరో ఏ సినిమా చేస్తున్నాడు.. దాని దర్శకుడు ఎవరు.. సినిమా పేరేంటి.. లాంటి అంశాల్ని సినీఅభిమానులు ఆరా తీస్తున్నారు. కానీ ఎలాంటి అంచనాలు పెంచకుండా కామ్ గా తన పని తాను చేసుకుపోతున్నాడు గోపీచంద్.  రెండు సినిమాల సక్సెస్ ల తర్వాత కూడా మీడియాకు దూరంగా ఉంటూ పని కానిచ్చేస్తున్నాడు. ప్రస్తుతం ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఓ యాక్షన్ […]

Advertisement
Update:2015-09-17 04:10 IST
లౌక్యం, జిల్ లాంటి వరుస హిట్ సినిమాల తర్వాత అందరి దృష్టి గోపీచంద్ పై పడింది. ఈ హీరో ఏ సినిమా చేస్తున్నాడు.. దాని దర్శకుడు ఎవరు.. సినిమా పేరేంటి.. లాంటి అంశాల్ని సినీఅభిమానులు ఆరా తీస్తున్నారు. కానీ ఎలాంటి అంచనాలు పెంచకుండా కామ్ గా తన పని తాను చేసుకుపోతున్నాడు గోపీచంద్. రెండు సినిమాల సక్సెస్ ల తర్వాత కూడా మీడియాకు దూరంగా ఉంటూ పని కానిచ్చేస్తున్నాడు. ప్రస్తుతం ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు గోపీచంద్. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని షాద్ నగర్ లో జరుగుతోంది. సినిమా కూడా దాదాపు 50శాతం కంప్లీట్ అయిపోయింది. ఈ నేపథ్యంలో వినాయక చవితి కానుకగా గోపీచంద్ కొత్త సినిమా టైటిల్ ను విడుదల చేయాలని భావిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే కొన్ని పేర్లు అనుకున్నారు. వాటిలోంచి ఓ టైటిల్ ను వినాయకచవితి నాడు విడుదల చేసే అవకాశముంది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.
Tags:    
Advertisement

Similar News