చారుశీలగా మారిన జబర్దస్త్ భామ
జబర్దస్త్ కామెడీ సిరీస్ తో బాగా పాపులర్ అయింది రష్మి. ఆమె అందచందాలు, ఎక్స్ ప్రెషన్స్ చాలామంది సినీమేకర్స్ ను ఆకర్షించాయి. ఇప్పటికే ధనలక్ష్మి తలుపు తడితే అనే సినిమాలో నటించింది రష్మి. ప్రస్తుతం గుంటూరు టాకీస్ అనే మరో సినిమా కూడా చేస్తోంది. ఇప్పుడు ముచ్చటగా మూడో ప్రయత్నంగా చారుశీలగా కూడా మారింది. అవును.. రష్మి ప్రధాన పాత్రలో చారుశీల సినిమా తాజాగా ప్రారంభమైంది. ఆసక్తికరమైన విషయం ఎంటంటే.. ఈ సినిమా కథ, కథనం అంతా […]
Advertisement
జబర్దస్త్ కామెడీ సిరీస్ తో బాగా పాపులర్ అయింది రష్మి. ఆమె అందచందాలు, ఎక్స్ ప్రెషన్స్ చాలామంది సినీమేకర్స్ ను ఆకర్షించాయి. ఇప్పటికే ధనలక్ష్మి తలుపు తడితే అనే సినిమాలో నటించింది రష్మి. ప్రస్తుతం గుంటూరు టాకీస్ అనే మరో సినిమా కూడా చేస్తోంది. ఇప్పుడు ముచ్చటగా మూడో ప్రయత్నంగా చారుశీలగా కూడా మారింది. అవును.. రష్మి ప్రధాన పాత్రలో చారుశీల సినిమా తాజాగా ప్రారంభమైంది. ఆసక్తికరమైన విషయం ఎంటంటే.. ఈ సినిమా కథ, కథనం అంతా రష్మి చుట్టూనే తిరుగుతుంది. రాజీవ్ కనకాల, బ్రహ్మానందం ఇతర కీలక పాత్రలు పోషిస్తారు. సినిమాకు ఉయ్యూరు శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తాడు. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న ఈ సినిమాన తన కెరీర్ ను మలుపుతిప్పుతుందని భావిస్తోంది రష్మి. ఈ సినిమాతో బడా హీరోల సరసన ఆఫర్లు వస్తాయని గట్టిగా నమ్ముతోంది. ఈ జబర్దస్త్ భామ తన మూడో సినిమాతో ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.
Advertisement