కొత్తవలస జిందాల్‌ స్టీల్‌ లాకౌట్‌

విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలోని జిందాల్‌ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ లిమిటెడ్‌ (ఫెర్రో) పరిశ్రమను యాజమాన్యం మూసివేసింది. విద్యుత్‌ ఛార్జీల ప్రభావం, కార్మిక సమస్యల కారణంగా మూసి వేసినట్లు ఆ పరిశ్రమ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎస్‌కె అగర్వాల్‌ పేరున ఫ్యాక్టరీ కార్యాలయంలో నోటీసు అతికించారు. ఆదివారం ‘ఎ’ షిఫ్ట్‌ డ్యూటీకి వెళ్లిన కార్మికులకు పరిశ్రమ సెక్యూరిటీ గార్డుల ద్వారా విషయం తెలియడంతో వారు ఆవేదనకు, ఆగ్రహానికి గురయ్యారు. శనివారం అర్ధరాత్రి పరిశ్రమ గేటుకు తాళాలు వేయడంతో ప్రత్యక్షంగా […]

Advertisement
Update:2015-09-14 06:38 IST
విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలోని జిందాల్‌ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ లిమిటెడ్‌ (ఫెర్రో) పరిశ్రమను యాజమాన్యం మూసివేసింది. విద్యుత్‌ ఛార్జీల ప్రభావం, కార్మిక సమస్యల కారణంగా మూసి వేసినట్లు ఆ పరిశ్రమ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎస్‌కె అగర్వాల్‌ పేరున ఫ్యాక్టరీ కార్యాలయంలో నోటీసు అతికించారు. ఆదివారం ‘ఎ’ షిఫ్ట్‌ డ్యూటీకి వెళ్లిన కార్మికులకు పరిశ్రమ సెక్యూరిటీ గార్డుల ద్వారా విషయం తెలియడంతో వారు ఆవేదనకు, ఆగ్రహానికి గురయ్యారు. శనివారం అర్ధరాత్రి పరిశ్రమ గేటుకు తాళాలు వేయడంతో ప్రత్యక్షంగా 600 మంది కార్మికులు, పరోక్షంగా మరో 2 వేల మంది ఉపాధి కోల్పోయారు. పరిశ్రమను తక్షణమే తెరిచి కార్మికులకు జీవనోపాధికి ఇబ్బంది లేకుండా చేయాలని సీఐటీయు డిమాండ్‌ చేసింది.
Tags:    
Advertisement

Similar News