ఎమ్ఎమ్ టీఎస్ వెంట పడిన వైవీఎస్
రేయ్ సినిమాతో చెప్పుకోనంత నష్టాన్ని కొనితెచ్చుకున్నాడు వైవీఎస్ చౌదరి. కొత్త హీరోపై 30 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి, దాదాపు 20 కోట్ల రూపాయలకు మునిగిపోయాడు. ఆ లాస్ ను ఎలా భర్తీచేసుకోవాలో తెలీక, కొన్నాళ్లు ఇంటికే పరిమితమైపోయాడు. అయితే ఒక్క విషయాన్ని మాత్రం గ్రహించాడు చౌదరి. లేనిపోని ఆర్భాటాలకు పోయి, హై-లొకేషన్లు పేరుచెప్పి డబ్బు వృధాచేయకూడదని మాత్రం తెలుసుకున్నాడు. అందుకే ఈసారి ఏ సినిమా చేసినా కాస్త సింపుల్ గా ఉండాలనే ఉద్దేశంతో కథ రాసుకున్నాడు. […]
Advertisement
రేయ్ సినిమాతో చెప్పుకోనంత నష్టాన్ని కొనితెచ్చుకున్నాడు వైవీఎస్ చౌదరి. కొత్త హీరోపై 30 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి, దాదాపు 20 కోట్ల రూపాయలకు మునిగిపోయాడు. ఆ లాస్ ను ఎలా భర్తీచేసుకోవాలో తెలీక, కొన్నాళ్లు ఇంటికే పరిమితమైపోయాడు. అయితే ఒక్క విషయాన్ని మాత్రం గ్రహించాడు చౌదరి. లేనిపోని ఆర్భాటాలకు పోయి, హై-లొకేషన్లు పేరుచెప్పి డబ్బు వృధాచేయకూడదని మాత్రం తెలుసుకున్నాడు. అందుకే ఈసారి ఏ సినిమా చేసినా కాస్త సింపుల్ గా ఉండాలనే ఉద్దేశంతో కథ రాసుకున్నాడు. అలా రాసుకున్నస్టోరీనే ఎమ్ఎమ్ టీఎస్ లవ్ స్టోరీ. అవును.. ఎమ్ ఎమ్ టీఎస్ ట్రయిన్ బ్యాక్ డ్రాప్ లో ఓ స్టోరీ రాసుకున్నాడు వైవీఎస్ చౌదరి. కథకు కాస్త ఫినిషింగ్ టచ్ ఇచ్చిన తర్వాత నటీనటులను ఎంపిక చేసుకోవాలనుకుంటున్నాడు. ఈసారి లో-బడ్జెట్ లోనే సినిమాను తీయాలనుకుంటున్నాడు. చౌదరి గారు ఈసారైనా సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడని ఆశిద్దాం.
Advertisement