విలువైన ప్రాణాలు తీసుకోవద్దు: హరీష్ హితవు
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వం పెద్దదిక్కుగా ఉంటుందని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. ప్రాణం చాలా విలువైనదని, ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన హితవు చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించడంతోపాటు నక్సలైట్ల చేతుల్లో మరణించిన కుటుంబాలకు పరిహారం, సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీని ఆయన చేపట్టారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ఎమ్మెల్యే బాబూమోహన్, కలెక్టర్ రోనాల్డ్‌రోస్ పాల్గొన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబ సభ్యుల సాదక […]
Advertisement
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వం పెద్దదిక్కుగా ఉంటుందని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. ప్రాణం చాలా విలువైనదని, ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన హితవు చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించడంతోపాటు నక్సలైట్ల చేతుల్లో మరణించిన కుటుంబాలకు పరిహారం, సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీని ఆయన చేపట్టారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ఎమ్మెల్యే బాబూమోహన్, కలెక్టర్ రోనాల్డ్‌రోస్ పాల్గొన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబ సభ్యుల సాదక బాధకాలను దాదాపు రెండున్నర గంటలపాటు మంత్రి హరీశ్‌రావు అడిగి తెలుసుకున్నారు. ఓపిగ్గా విని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. రైతుల సమస్యల విషయంలో నిర్లక్ష్యం వహించిన అధికారులను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. రైతు ఆత్మహత్యల పుణ్యం గత కాంగ్రెస్, టీడీపీలదేనని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ రైతు ఆత్మహత్యలపై పునర్విచారణ జరిపించి కాంగ్రెస్, టీడీపీ హయాంలో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రూ.లక్షా 50 వేలు ఆర్థిక సహాయం అందిస్తున్నారని గుర్తుచేశారు.
Advertisement