అందుకే అమెరికా లో ప్లాన్ చేస్తున్నారు..!
శ్రీమంతుడు చిత్రం తెలుగ సినిమా గౌరవాన్ని పెంచింది. మహేష్ బాబు సహనిర్మాతగా చేసి..నటించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఒక మంచి పాయింట్ ను క్లాస్ గా తెరకెక్కించి అందర్ని ఆలోచింప చేశాడు దర్శకుడు కొరటాల శివ. సినిమాలు సమాజం పై ప్రభావితం చూపుతాయి అనడానికి శ్రీమంతుడు చిత్రం ఒక ఉదహారణే. ఈ మధ్య సెలిబ్రిటీలు.. కొన్ని గ్రామాల్ని దత్తతు తీసుకోవడానికి ముందుకు రావడం వెనక ఈ చిత్రం ప్రభావం వుంది అనడంలో సందేహాం లేదు. […]
శ్రీమంతుడు చిత్రం తెలుగ సినిమా గౌరవాన్ని పెంచింది. మహేష్ బాబు సహనిర్మాతగా చేసి..నటించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఒక మంచి పాయింట్ ను క్లాస్ గా తెరకెక్కించి అందర్ని ఆలోచింప చేశాడు దర్శకుడు కొరటాల శివ. సినిమాలు సమాజం పై ప్రభావితం చూపుతాయి అనడానికి శ్రీమంతుడు చిత్రం ఒక ఉదహారణే. ఈ మధ్య సెలిబ్రిటీలు.. కొన్ని గ్రామాల్ని దత్తతు తీసుకోవడానికి ముందుకు రావడం వెనక ఈ చిత్రం ప్రభావం వుంది అనడంలో సందేహాం లేదు.
మొత్తం మీద బాహుబలి తరువాత అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా నిలిచి రికార్డులు సృష్టించింది. అయితే ఈ సినిమా నిర్మాతల్లొ ముగ్గురు అమెరికా కు చెందిన వాళ్లు కావడంతో.. యాభై రోజుల పండగ ను అక్కడ చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. శ్రీమంతుడు సినిమాకు ఒక్క యుఎస్ మార్కెట్ నే 12 కోట్ల వరకు షేర్ అందించింది. ఇధికాక మిగిలిన దేశాల్లో రెండు కోట్ల వరకు వచ్చింది. అంటే దాదాపుగా మన నైజాం మార్కెట్ తో సమానం. నిదానంగా తెలుగు సినిమా పరిధిని యు ఎస్ లో మరింత పెంచడానికి శ్రీమంతుడు సినిమా యాభై రోజులు వేడుక దోహాద పడుతుంది అంటున్నారు ప్రొడ్యూసర్స్ . కరెక్ట్ కదా.!