ఏ ఆర్ రహ్మాన్‌పై ఫత్వా!
ఇంతకాలం సంగీతంతో ప్రేక్షకులను రంజింపజేసిన రహ్మాన్ ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ముస్లిం వ్యతిరేకి! అంటూ ముంబైకి చెందిన సున్నీ ముస్లిం సంస్థ రజా అకాడమీ ఫత్వా జారిచేసింది. ముస్లిం ప్రవక్త మహ్మద్ ప్రాఫెట్ నేపథ్యం ఆధారంగా రూపొందించిన ఓ వివాదాస్పద చిత్రానికి సంగీతం అందించడమే ఇందుకు కారణం. ఇటీవల ఇరానియన్ దర్శకుడు మాజిద్ దర్శకత్వంలో ఫ్రాఫెట్ మహమ్మద్ జీవితం ఆధారంగా మూడు చిత్రాలు రూపొందిస్తున్నారు. ఇందులో మొదటి భాగంగా విడుదలైన ‘మహమ్మద్: ది మెసేంజర్ ఆఫ్ గాడ్’ అనే […]
Advertisement
ఇంతకాలం సంగీతంతో ప్రేక్షకులను రంజింపజేసిన రహ్మాన్ ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ముస్లిం వ్యతిరేకి! అంటూ ముంబైకి చెందిన సున్నీ ముస్లిం సంస్థ రజా అకాడమీ ఫత్వా జారిచేసింది. ముస్లిం ప్రవక్త మహ్మద్ ప్రాఫెట్ నేపథ్యం ఆధారంగా రూపొందించిన ఓ వివాదాస్పద చిత్రానికి సంగీతం అందించడమే ఇందుకు కారణం. ఇటీవల ఇరానియన్ దర్శకుడు మాజిద్ దర్శకత్వంలో ఫ్రాఫెట్ మహమ్మద్ జీవితం ఆధారంగా మూడు చిత్రాలు రూపొందిస్తున్నారు. ఇందులో మొదటి భాగంగా విడుదలైన ‘మహమ్మద్: ది మెసేంజర్ ఆఫ్ గాడ్’ అనే పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం వివాదాస్పదంగా మారింది. ఇందులో పలు సన్నివేశాలు ప్రాఫెట్‌ను కించపరిచే విధంగా ఉన్నాయని కొన్ని ముస్లిం మత సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ వివాదాస్పద చిత్రానికి సంగీతం అందించినందుకు గాను రహ్మాన్ మతపెద్దల ఆగ్రహానికి గురయ్యాడు. అందుకే వారు రహ్మాన్‌కు వ్యతిరేకంగా ఫత్వా జారీ చేశారు.
Advertisement