నిఖిల్ ఖుషి ..ఖుషి

యువ హీరోల్లో నిఖిల్  ఒక ఎన‌ర్జిటిక్  యాక్ట‌ర్.   హ్యాపిడేస్ లో  మ‌నోడి  జోష్     ఆ ఏజ్ కుర్ర ఆడియ‌న్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది.  ఆ త‌రువాత సోలో  హీరోగా కొన్ని చిత్రాలు చేసి   విజ‌యాలు ద‌క్క‌క చాల  ఒత్తిడి ఫేస్ చేశాడు. క‌ట్ చే్స్తే..   స్వామిరారా నుంచి  ఫార్మేట్ ను మార్చుకున్నాడు.  అప్ప‌టి నుంచి తిరుగులేదు. ఆఫ్ కోర్స్ స్వామి రారా త‌రువాత   చేసింది ఒక్క సినిమానే అనుకోండి.  కార్తీకేయ  పేరు తో  త‌ను స్నేహితుడిని  […]

Advertisement
Update:2015-09-11 06:33 IST

యువ హీరోల్లో నిఖిల్ ఒక ఎన‌ర్జిటిక్ యాక్ట‌ర్. హ్యాపిడేస్ లో మ‌నోడి జోష్ ఆ ఏజ్ కుర్ర ఆడియ‌న్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది. ఆ త‌రువాత సోలో హీరోగా కొన్ని చిత్రాలు చేసి విజ‌యాలు ద‌క్క‌క చాల ఒత్తిడి ఫేస్ చేశాడు. క‌ట్ చే్స్తే.. స్వామిరారా నుంచి ఫార్మేట్ ను మార్చుకున్నాడు. అప్ప‌టి నుంచి తిరుగులేదు.
ఆఫ్ కోర్స్ స్వామి రారా త‌రువాత చేసింది ఒక్క సినిమానే అనుకోండి. కార్తీకేయ పేరు తో త‌ను స్నేహితుడిని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేశాడు. ఈ చిత్రం మంచి క‌మ‌ర్షియ‌ల్ హిట్ సాధించింది. స్వామిరారా వ‌ర‌కు ప‌రాజ‌యాలు ప‌ల‌క‌రించ‌డం.. ఆ త‌రువాత స‌క్సెస్ రావ‌డంతో.. నిఖిల్ క‌థ‌ల ఎంపికలో ..త‌న యాక్టింగ్ విష‌యంలో తీసుకున్న జాగ్ర‌త్త‌లు ఇప్పుడు స‌క్సెస్ కు హెల్స్ అవుతున్నాయంటారు ప‌రిశీల‌కులు. తాజాగా శంకరాభ‌ర‌ణం పేరు తో ఒక చిత్రం చేస్తున్నాడు. కోన వెంక‌ట్ తెర వెన‌క అన్నీ చూసుకుంటున్న ఈ చిత్రానికి ఉద‌య్ నంద‌న్ వ‌న‌మ్ అనే కొత్త ద‌ర్శ‌కుడు ప‌రిచ‌యం అవుతున్నాడు. ఈసినిమాకు సంబంధించి అన్ని ఏరియాల్లో నిఖిల్ కెరీర్ లో ది బెస్ట్ బిజినెస్ జ‌రిగిన‌ట్లు ..నిఖిల్ త‌న సోష‌ల్ నెట్ వ‌ర్క్ లో షేర్ చేసుకున్నాడు. ఈ చి్త్రంలో హీరోయిన్ గా నందిత చేస్తుండ‌గ‌.. ఒక గెస్ట్ రోల్ లో అంజ‌లి చేస్తుంది. త్వ‌ర‌లో రిల‌జీ్ కు స‌న్నాహాలు చేస్తున్నారు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా శంక‌రాభ‌ర‌ణం చిత్రం చేసిన‌ట్లు తెలుస్తుంది. మొత్తం మీద నిఖిల్ మార్కెట్ సినిమాకు సినిమాకు పెరుగుతుండ‌టం విశేషం. ఇది నిజంగా నిఖిల్ కు హ్యాపిన్యూసే క‌దా మ‌రి.!

Tags:    
Advertisement

Similar News