ఛారిటీ ఎట్‌ టెంపుల్‌ : చంద్రబాబు పిలుపు

ప్రతి దేవాలయంలో నిత్యం అన్నదానం జరగాలని, విద్యాదానానికి ముందుండాలని, వైద్య సేవల్లో నిమగ్నమవ్వాలని… ఛారిటీ ఎట్‌ టెంపుల్‌ అన్నట్టు ఆలయాలు ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపు ఇచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే దేవాలయాలు అభివృద్ధి కేంద్రాలుగా మారాలని ఆయన స్పష్టం చేశారు. విజయవాడలోని దేవాదాయశాఖపై సమీక్షించిన ఆయన ఆలయ ప్రాంగాణాల్లో యోగా, ఆయుష్‌ కేంద్రాలు, వెల్‌నెస్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. గోదావరి పుష్కరాలు ఎంత ఘనంగా నిర్వహించామో కృష్ణా పుష్కరాలను కూడా […]

Advertisement
Update:2015-09-11 10:50 IST
ప్రతి దేవాలయంలో నిత్యం అన్నదానం జరగాలని, విద్యాదానానికి ముందుండాలని, వైద్య సేవల్లో నిమగ్నమవ్వాలని… ఛారిటీ ఎట్‌ టెంపుల్‌ అన్నట్టు ఆలయాలు ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపు ఇచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే దేవాలయాలు అభివృద్ధి కేంద్రాలుగా మారాలని ఆయన స్పష్టం చేశారు. విజయవాడలోని దేవాదాయశాఖపై సమీక్షించిన ఆయన ఆలయ ప్రాంగాణాల్లో యోగా, ఆయుష్‌ కేంద్రాలు, వెల్‌నెస్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. గోదావరి పుష్కరాలు ఎంత ఘనంగా నిర్వహించామో కృష్ణా పుష్కరాలను కూడా అంతే వైభవంగా జరపాలని చెబుతూ అందుకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని అధికారులను కోరారు. దేవాలయ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని, నిత్య దూపదీప నైవేద్యాలకు కొదవ లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు, కమిషనర్‌ అనురాధ తదితరులు కూడా పాల్గొన్నారు.
Tags:    
Advertisement

Similar News