సల్మాన్ శ్రీమంతుడు అవుతాడా..?

తెలుగులో హిట్ సినిమాల హక్కులు దక్కించుకోవడంలో సల్మాన్, అక్షయ్ కుమార్ ముందుంటారు. తెలుగు, తమిళ భాషల్లో ఏదైనా సినిమా హిట్టయిందంటే వెంటనే ఆ మూవీ రీమేక్ రైట్స్ దక్కించుకోవడానికి ఎగబడతారు. సల్మాన్ ఖాన్ అయితే ఏకంగా ఓ టీమ్ నే పెట్టుకున్నాడు. ఇందులో భాగంగా శ్రీమంతుడు సినిమాపై కండలవీరుడు కన్నేశాడని తెలుస్తోంది. తాజాగా ముంబయిలో శ్రీమంతుడు సినిమాను చూశాడు సల్మాన్ ఖాన్. మంచి సందేశాన్నిస్తూ ఎంటర్ టైనింగ్ గా తెరకెక్కిన ఇలాంటి సినిమాలో నటిస్తే బాగుంటుందని భావిస్తున్నాడు. […]

Advertisement
Update:2015-09-10 00:31 IST
తెలుగులో హిట్ సినిమాల హక్కులు దక్కించుకోవడంలో సల్మాన్, అక్షయ్ కుమార్ ముందుంటారు. తెలుగు, తమిళ భాషల్లో ఏదైనా సినిమా హిట్టయిందంటే వెంటనే ఆ మూవీ రీమేక్ రైట్స్ దక్కించుకోవడానికి ఎగబడతారు. సల్మాన్ ఖాన్ అయితే ఏకంగా ఓ టీమ్ నే పెట్టుకున్నాడు. ఇందులో భాగంగా శ్రీమంతుడు సినిమాపై కండలవీరుడు కన్నేశాడని తెలుస్తోంది. తాజాగా ముంబయిలో శ్రీమంతుడు సినిమాను చూశాడు సల్మాన్ ఖాన్. మంచి సందేశాన్నిస్తూ ఎంటర్ టైనింగ్ గా తెరకెక్కిన ఇలాంటి సినిమాలో నటిస్తే బాగుంటుందని భావిస్తున్నాడు. తాజాగా సల్మాన్ కూడా భజరంగీ భాయ్ జాన్ సినిమా చేశాడు. ఇది కూడా సందేశాత్మకంగానే తెరకెక్కింది. దీంతో శ్రీమంతుడు సినిమాను కూడా అదే బాటలో తెరకెక్కించాలనుకుంటున్నాడు. దీనికి సంబంధించి ఇప్పటికే సల్మాన్ ప్రతినిధులు కొంతమంది శ్రీమంతుడు మేకర్స్ తో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే బాలీవుడ్ తెరపై శ్రీమంతుడిగా సల్మాన్ ఖాన్ మెరవబోతున్నాడు.
Tags:    
Advertisement

Similar News