మృగాళ్ళకు బుద్ధి చెప్పిన కరాటే బాలిక

చీకటి వేళ ఒంటరిగా ఇంటికి వెళ్తున్న ఓ 16 ఏళ్ల బాలికపై కామాంధుల కన్ను పడింది. దీంతో ఆమెను టీజ్‌ చేయడం మొదలెట్టారు. తిడుతూ ప్రతిఘటించింది. మరో అడుగు ముందుకేసి అత్యాచారం చేయడానికి ఒడిగట్టారు. అంతే ఆ పిల్ల కాస్తా పిడుగుగా మారిపోయింది. తాను నేర్చుకున్న కరాటే పంచ్‌లతో వారి ముఖంపై పిడి గుద్దులు కురిపించింది. తప్పించుకుంటూ ఎదురు తిరిగారు. ఈసారి అపరకాళిగా మారిపోయింది. మరింత బలంగా పంచ్‌లిచ్చింది. కరాటే క్లాస్ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న […]

Advertisement
Update:2015-09-08 16:13 IST
చీకటి వేళ ఒంటరిగా ఇంటికి వెళ్తున్న ఓ 16 ఏళ్ల బాలికపై కామాంధుల కన్ను పడింది. దీంతో ఆమెను టీజ్‌ చేయడం మొదలెట్టారు. తిడుతూ ప్రతిఘటించింది. మరో అడుగు ముందుకేసి అత్యాచారం చేయడానికి ఒడిగట్టారు. అంతే ఆ పిల్ల కాస్తా పిడుగుగా మారిపోయింది. తాను నేర్చుకున్న కరాటే పంచ్‌లతో వారి ముఖంపై పిడి గుద్దులు కురిపించింది. తప్పించుకుంటూ ఎదురు తిరిగారు. ఈసారి అపరకాళిగా మారిపోయింది. మరింత బలంగా పంచ్‌లిచ్చింది. కరాటే క్లాస్ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న ఆ బాలికను సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు తాగుబోతులు అడ్డగించారు. ఆమెను పట్టుకోబోగా వారి ముఖంపై కరాటే పంచ్‌లు విరిసింది. ఊహించని ఈ పరిణామానికి వారిద్దరు బిత్తరపోయారు. తిరిగి ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈసారి మరింత బలంగా వారి ముఖంపై పంచ్‌లు విసిరింది. దీంతో రక్త గాయాలతో వారు కుప్పకూలిపోయారు. మెల్లగా లేచి సైకిల్ ఎక్కి అక్కడి నుంచి జారుకున్నారు. దారిన పోయే వారు ఆ బాలిక సాహసానికి ఆశ్చర్యపోయారు. బాలిక. తల్లిదండ్రులు కాదన్నా ఇష్టంతో నేర్చుకున్న కరాటేనే ఆమె మాన ప్రాణాలను కాపాడింది. పశ్చిమబెంగాల్ రాజధాని అయిన కోల్‌కతా శివారు గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ​
Tags:    
Advertisement

Similar News