తేజా హోరా హోరి బ్రీఫ్ గా..
డైరెక్టర్ తేజా కొత్త వాళ్లను పరిచయం చేయడంలో సిద్ద హస్తుడు. స్టార్ హీరోల చుట్టు తిరగడానికి పెద్దగా ఇష్టపడడు. కానీ తను పరిచయం చేసిన ఆర్టిస్ట్ లు ఉదయ్ కిరణ్, నితిన్ లాంటి వారు స్టార్స్ అయ్యారు. తాజాగా దిలిప్ అనే కొత్తబ్బాయిని పరిచయం చేస్తున్నారు. దీనికి హోరా హోరి అని టైటిల్ పెట్టారు. ఇదొక మంచి ప్రేమ కథ గా చేసినట్లు సినిమా ప్రచార చిత్రాలు తెలియ చేస్తున్నాయి. హోరా హోరి […]
Advertisement
డైరెక్టర్ తేజా కొత్త వాళ్లను పరిచయం చేయడంలో సిద్ద హస్తుడు. స్టార్ హీరోల చుట్టు తిరగడానికి పెద్దగా ఇష్టపడడు. కానీ తను పరిచయం చేసిన ఆర్టిస్ట్ లు ఉదయ్ కిరణ్, నితిన్ లాంటి వారు స్టార్స్ అయ్యారు. తాజాగా దిలిప్ అనే కొత్తబ్బాయిని పరిచయం చేస్తున్నారు. దీనికి హోరా హోరి అని టైటిల్ పెట్టారు. ఇదొక మంచి ప్రేమ కథ గా చేసినట్లు సినిమా ప్రచార చిత్రాలు తెలియ చేస్తున్నాయి.
హోరా హోరి చిత్రంతో దక్ష అనే హీరోయిన్ నటిస్తుంది. హీరోయిన్ సినిమాకు ప్లస్ అవుతుందని తెలుస్తుంది. స్మైలీ ఫేస్ తో.. ఆన్ స్క్రీన్ చాల ఎట్రాక్టివ్ గా ఉండటంతో జయం చిత్రంతో సదా మాదిరి .. హోరా హోరి చిత్రంతో దక్ష కూడా కెరీర్ పరంగా ఫుల్ బిజీ అవుతుందనేది దర్శకుడి మాట.
ఈ చిత్రంతో ఒక కొత్త విలిన్ టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ఇక కళ్యాణి మాలిక్ అందించిన మ్యూజిక్ కు ఇప్పటికే చాల మంచి టాక్ వచ్చింది. ఈ చిత్రంలో రెయిన్ ఎఫెక్ట్ కోసం ఒక ప్రత్యేకమైన మిషన్ ను తేజా చేయించారు. దీపిక్ అనే కెమెరామెన్ సినిమాటోగ్రఫి అందించారు. స్వతహాగా టాలెంటెడ్ కెమెరామెన్ అయిన తేజా ను ఇంప్రెస్ చేయడం అంటే చాల కష్టం. అయితే హోరా హోరి సినిమాటోగ్రఫర్ తేజా ను మెప్పించాడు. సినిమా ఒక విజువల్ ఫీస్ట్ అంటున్నారు. మొత్తం మీద హోరా హోరి ఒక ప్రామిసంగ్ ఫిల్మ్ అంటున్నారు చిత్ర యూనిట్.
Advertisement