అల్లు అర్జున్ ఆరోగ్యంపై వదంతులు!
అల్లు అర్జున్ ఆరోగ్యంపై వదంతులు వ్యాపించాయి. ఆయనకు ఆరోగ్యం బాగోలేదన్న వార్తలు గుప్పు మనడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఆయన ప్రమాదంలో గాయపడ్డారని, ఆయనకు ప్రమాద పరిస్థితి ఏర్పడిందని ఒక్కసారిగా వార్తలు రావడంతో అభిమానులు కలత చెందుతున్నారు. దీంతో అర్జున్ తండ్రి అల్లు అరవింద్ ఓ ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది. అర్జున్‌కు ఎలాంటి ఆరోగ్య సమస్య లేదని, వందతులను నమ్మవద్దని ఆయన అభిమానులను కోరారు. గతంలో కారు ప్రమాదంలో గాయపడిన అర్జన్ భార్య స్నేహలతా రెడ్డి […]
Advertisement
అల్లు అర్జున్ ఆరోగ్యంపై వదంతులు వ్యాపించాయి. ఆయనకు ఆరోగ్యం బాగోలేదన్న వార్తలు గుప్పు మనడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఆయన ప్రమాదంలో గాయపడ్డారని, ఆయనకు ప్రమాద పరిస్థితి ఏర్పడిందని ఒక్కసారిగా వార్తలు రావడంతో అభిమానులు కలత చెందుతున్నారు. దీంతో అర్జున్ తండ్రి అల్లు అరవింద్ ఓ ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది. అర్జున్‌కు ఎలాంటి ఆరోగ్య సమస్య లేదని, వందతులను నమ్మవద్దని ఆయన అభిమానులను కోరారు. గతంలో కారు ప్రమాదంలో గాయపడిన అర్జన్ భార్య స్నేహలతా రెడ్డి ఆరోగ్యం బాగోలేనందున ఆమెను యశోద ఆస్పత్రికి తీసుకువచ్చామని, కాలికి చిన్న ఆపరేషన్ చేయాల్సి ఉందని, ఈరోజు సాయంత్రానికల్లా అది పూర్తవుతుందని, ఆ వెంటనే ఆస్పత్రి నుంచి తీసుకుపోతామని అరవింద్ తెలిపారు.
Advertisement