2020నాటికి ఏపీలో 100 శాతం అక్షరాస్యత: బాబు

2019-20 నాటికి రాష్ట్రం వంద శాతం అక్షరాస్యత సాధిస్తుందని ఏపీ ముఖ్యమంత్రి ఎన్‌. చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంలో భాగంగా ఆయన మంగళవారం విజయవాడలో రాష్ట్రంలో ఆరో దశ అక్షరాస్యత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యతోనే ప్రపంచ జ్ఞానం ఏర్పడుతుందని, ఆత్మ విశ్వాసం పెరుగుతుందని అన్నారు. గత తెలుగుదేశం పాలనలో 17 శాతం అక్షరాస్యత సాధించామని, కాని ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం చదువు మీద ఏ మాత్రం […]

Advertisement
Update:2015-09-08 07:53 IST
2019-20 నాటికి రాష్ట్రం వంద శాతం అక్షరాస్యత సాధిస్తుందని ఏపీ ముఖ్యమంత్రి ఎన్‌. చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంలో భాగంగా ఆయన మంగళవారం విజయవాడలో రాష్ట్రంలో ఆరో దశ అక్షరాస్యత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యతోనే ప్రపంచ జ్ఞానం ఏర్పడుతుందని, ఆత్మ విశ్వాసం పెరుగుతుందని అన్నారు. గత తెలుగుదేశం పాలనలో 17 శాతం అక్షరాస్యత సాధించామని, కాని ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం చదువు మీద ఏ మాత్రం దృష్టి పెట్టక పోవడంతో గత పదేళ్ళలో 6.5 శాతం మాత్రమే అక్షరాస్యత పెరిగిందని ఆయన చెప్పారు. ప్రపంచంలోని చదువుకోని వారిలో 50 శాతం మన దేశంలోనే ఉన్నారని ఆయన అన్నారు. ఇది సిగ్గు పడాల్సిన విషయమని, మనం 31వ స్థానంలో ఉన్నామని తెలిపారు. చదువు మీద సాధికారిత ఉండాలన్న లక్ష్యంతోనే డ్వాక్రా సంఘాలను అందులో భాగస్వాములను చేశామని, ఈరోజు మహిళలు ప్రగతి పథంలో పయనిస్తున్నారంటే వారికి చదువు అబ్బడమే కారణమని అన్నారు. మహిళలు అక్షరమే ఆయుధంగా చదువుకోవాలని, తద్వారా మంచి ఆదాయం సాధ్యమవుతుందన్నారు. మహిళా సంఘాలు సంఘటిత శక్తిగా ఎదగాలని చంద్రబాబు కోరారు.
Tags:    
Advertisement

Similar News