అందుకే... రైల్వేజోన్ ఆలస్యం: అశోక్‌గజపతి
విభజన చట్టంలో విశాఖ రైల్వేజోన్‌ను చేర్చి ఉంటే దాన్ని త్వరగా సాధించేందుకు అవకాశం కలిగేదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు అన్నారు. అందరి సహకారంతో విశాఖ జోన్‌ను సాధిస్తామని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. విశాఖ రైల్వేజోన్ విషయం.. విభజన చట్టంలో పొందు పర్చకపోవటంతోనే జాప్యమవుతోందని అన్నారు. శ్రీకాకుళం జిల్లా సరిహద్దులోని విజయనగం జిల్లా భోగాపురంలో మోడరన్ విమాశ్రయాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. విమానాశ్రయానికి రైతుల అంగీకారంతోనే భూ సేకరణ జరుగుతుందన్నారు. మోడరన్ విమానాశ్రయాలు దేశంలో […]
Advertisement
విభజన చట్టంలో విశాఖ రైల్వేజోన్‌ను చేర్చి ఉంటే దాన్ని త్వరగా సాధించేందుకు అవకాశం కలిగేదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు అన్నారు. అందరి సహకారంతో విశాఖ జోన్‌ను సాధిస్తామని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. విశాఖ రైల్వేజోన్ విషయం.. విభజన చట్టంలో పొందు పర్చకపోవటంతోనే జాప్యమవుతోందని అన్నారు. శ్రీకాకుళం జిల్లా సరిహద్దులోని విజయనగం జిల్లా భోగాపురంలో మోడరన్ విమాశ్రయాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. విమానాశ్రయానికి రైతుల అంగీకారంతోనే భూ సేకరణ జరుగుతుందన్నారు. మోడరన్ విమానాశ్రయాలు దేశంలో హైదరాబాద్, బెంగుళూర్, ఢిల్లీల్లో ఉన్నాయని అదే తరహాలో భోగాపురం విమానాశ్రయం ఉంటుందన్నారు. కేంద్ర ప్రభు త్వం గ్రామీణ విద్యుత్ సరఫరాకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని, సరఫరాలో లోపా లు, లోటు, నష్టాన్ని తగ్గించుకుని మెరుగైన సేవలందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అశోక్ పేర్కొన్నారు.
Advertisement