ఆ ఒక్క‌టి దీపిక ఒంటికి ప‌డ‌ద‌ట‌...!

టాప్ హీరోయిన్  అంటే సంపాద‌న‌కు చాల సోర్స్ లుంటాయి. సినిమాల‌తో పాటు.. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్,  లైవ్ ఈవెంట్స్, రియాల్టీ షోల‌కు గెస్ట్ అప్పిరియ‌న్స్,   ఇలా బ్యాంక్ బ్యాలెన్స్  పెంచుకునే మార్గాలు చాల వుంటాయి. అయితే  కొంద‌రు హీరోయిన్స్  ఒక‌డుగు ముంద‌కు వేసి నిర్మాత‌లుగా కూడా  మారి  లాభాలు అర్జిస్తున్నారు. ఈ మ‌ధ్య అనుష్క శర్మ‌,  ఎన్ హెచ్ 10 అనే సినిమాను నిర్మించి  మంచి లాభాలు  సంపాదించిన విష‌యం తెలిసిందే. ఇక ఇదే దారిలో ప్రియాంక […]

Advertisement
Update:2015-09-07 06:30 IST

టాప్ హీరోయిన్ అంటే సంపాద‌న‌కు చాల సోర్స్ లుంటాయి. సినిమాల‌తో పాటు.. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్, లైవ్ ఈవెంట్స్, రియాల్టీ షోల‌కు గెస్ట్ అప్పిరియ‌న్స్, ఇలా బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకునే మార్గాలు చాల వుంటాయి. అయితే కొంద‌రు హీరోయిన్స్ ఒక‌డుగు ముంద‌కు వేసి నిర్మాత‌లుగా కూడా మారి లాభాలు అర్జిస్తున్నారు. ఈ మ‌ధ్య అనుష్క శర్మ‌, ఎన్ హెచ్ 10 అనే సినిమాను నిర్మించి మంచి లాభాలు సంపాదించిన విష‌యం తెలిసిందే. ఇక ఇదే దారిలో ప్రియాంక చోప్రా కూడా ఉంది. త‌ను నిర్మాత గా ఒక సినిమాను చేయ‌డానికి సిద్దం అయ్యింది.
క‌ట్ చేస్తే బి టౌన్ లో టాప్ హీరోయిన్స్ లో ఒక‌రైన దీపిక ప‌దుకోణ్ మాత్రం ప్రొడ్యూస‌ర్ గా మారే ప్ర‌స‌క్తే లేదంటోంది. నిర్మాణం అంటే ఎన్నో టెన్స‌న్స్..ఎంతో పెట్టుబ‌డి పెట్టాలి. పెట్టిన త‌ర‌వాత తిరిగి వ‌స్తుంద‌ని గ్యారంటి లేదంటోంది. అందుకే త‌ను చేయాల‌నుకుంటే లైన్ ప్రొడ్యూస‌ర్ గా చేస్తాగానీ.. కంప్లీట్ గా ఒక సినిమాను నిర్మించే స్థాయి రిస్క్ ఎప్ప‌టికి తీసుకోన‌ని క్లారిటి ఇచ్చేసిందండోయ్.. హాట్ బ్యూటీ విత్ బ్రెయిన్ అంటే ఇదే క‌దా మ‌రి..!

Tags:    
Advertisement

Similar News