నానీతో మారుతి మారినట్లేనా.. ?
గుర్తింపు రావాలంటే.. ఏదో ఒకటి చేయాలి. చేసేది బూతు అయితే త్వరగా గుర్తింపు వస్తుంది. ఈ నిజాన్ని క్రియేటివ్ గా వాడుకుని ఈ రోజుల్లో అంటూ పరిమితమైన బడ్జెట్ తో చిత్రం చేసి సంచలనం చేసిన దర్శకుడు మారుతి. ఆ తరువాత చేసిన బస్టాప్, రొమాంటికి్ చిత్రాలు కూడా అదే తరహాలో ఉండటంతో మారుతి అంటే అడల్డ్ కామెడికి కేరాఫ్ అని ముద్ర పడింది. తన పేరు ను చిన్న చిత్రాల వాళ్లకు రెంట్ కు కూడా […]
Advertisement
గుర్తింపు రావాలంటే.. ఏదో ఒకటి చేయాలి. చేసేది బూతు అయితే త్వరగా గుర్తింపు వస్తుంది. ఈ నిజాన్ని క్రియేటివ్ గా వాడుకుని ఈ రోజుల్లో అంటూ పరిమితమైన బడ్జెట్ తో చిత్రం చేసి సంచలనం చేసిన దర్శకుడు మారుతి. ఆ తరువాత చేసిన బస్టాప్, రొమాంటికి్ చిత్రాలు కూడా అదే తరహాలో ఉండటంతో మారుతి అంటే అడల్డ్ కామెడికి కేరాఫ్ అని ముద్ర పడింది. తన పేరు ను చిన్న చిత్రాల వాళ్లకు రెంట్ కు కూడా ఇచ్చి తన ఇదిని మరింతగా విస్తరించుకున్నాడు.
మరి నానీ లాంటి ప్రతిభావంతుడైన నటుడు మారుతి డైరెక్షన్ లో చిత్రం చేస్తున్నాడంటే అభిమానులు ఒకింత గందర గోళంలో పడ్డారు. నానీ.. మారుతి దారిలో వెళ్తాడా..లేకా.. మారుతి నానీ దారిలోకి వస్తాడా..? ఈ చర్చ జరిగింది. కట్ చేస్తే.. భలే భలే మగాడివోయ్ సినిమా రిలీజ్ అయ్యింది. నానీకి మంచి హిట్ ఇచ్చాడు. సినిమా కథ పరంగా కొన్ని లోపాలు వున్నప్పటికి తెలివిగా కవర్ చేసి.. థియేటర్లో చూస్తున్నంత సేపు నవ్వించే విధంగా సినిమాను తీర్చి దిద్దాడు. అన్నింటికంటే ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే..భలే భలే మగాడివోయ్ చిత్రం చూస్తే..ఇది నిజంగా మారుతి చిత్రమేనా అనిపిస్తుంది..? ఎందుకంటే..ఇది క్లీన్ అండ్ గ్రీన్ మూవీ. మొత్తం మీద నానీ తో మారుతి మారినట్లే అనుకోవాలి..!?
Advertisement