రోబో సీక్వెల్ 300 కోట్ల బడ్జెట్..!
రోబో సీక్వెల్ కు సంబంధించి గత మూడు సంవత్సరాలుగా రూమర్ల గోల ఎక్కువయ్యింది. ప్రామిసింగ్ డైరెక్టర్ శంకర్..సూపర్ స్టార్ రజని కాంత్.. వర్సటైల్ యాక్టరెస్ ఐశ్వర్య కాంబినేషన్ లో వచ్చిన రోబో చిత్రం ఒక వండర్ క్రియోట్ చేసిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో అత్యధిక సాంకేతిక హంగులతో వచ్చిన ఈచిత్రం కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు కొట్టింది. అయితే ఈ సినిమా సీక్వెల్ కు సంబంధించి డైరెక్టర్ శంకర్ ఒక క్లారీటి […]
Advertisement
రోబో సీక్వెల్ కు సంబంధించి గత మూడు సంవత్సరాలుగా రూమర్ల గోల ఎక్కువయ్యింది. ప్రామిసింగ్ డైరెక్టర్ శంకర్..సూపర్ స్టార్ రజని కాంత్.. వర్సటైల్ యాక్టరెస్ ఐశ్వర్య కాంబినేషన్ లో వచ్చిన రోబో చిత్రం ఒక వండర్ క్రియోట్ చేసిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో అత్యధిక సాంకేతిక హంగులతో వచ్చిన ఈచిత్రం కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు కొట్టింది.
అయితే ఈ సినిమా సీక్వెల్ కు సంబంధించి డైరెక్టర్ శంకర్ ఒక క్లారీటి ఇచ్చారు. సీక్వెల్ లో రజనీకాంతే హీరోగా చేస్తారని ..మిగిలిన రో్ల్స్ మాత్రం అప్పుడే ఫైనల్ కాలేదని చెప్పారని టాక్. ఈ మధ్య విక్రమ్ తో చేసిన ఐ చిత్రం అంతగా ఆడలేదు. అలాగే గత యేడాది రజనీకాంత్ చేసిన రెండు భారీ బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం చవి చూశాయి. దీంతో రజనీకాంత్ కూడా ఒకటి రెండు సూపర్ హిట్స్ తన అభిమానులకు ఇవ్వాలనే కసితో వర్కువుట్ చేస్తున్నారు. దీంతో రోబో సీక్వెల్ ను శంకర్ చాల కసిగా చేస్తున్నారని వినికిడి అల్రేడి ప్రి ప్రొడక్షన్ పనులు ప్రారంభించారట. సీక్వెల్ స్టోరిని సిద్దం చేయమని జయమోహన్ కు అప్పచెప్పినట్లు టాక్. కడలి, నేను దేవుణ్ణి చిత్రాలకు కథలు అందించిన జయమోహన్ రోబో సీక్వెల్ కోసం బాగా కష్టపడుతున్నారట.ఇదిలా వుంటే రోబో సీక్వెల్ కు బడ్జెట్ 300 కోట్ల రూపాయలు ఉంటుందట. నభూతో నభవిష్యత్ అనే రేంజ్ లో సినిమా చేయాలనే ఆలోచనలో శంకర్ ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. సో చిట్టీ ఈజ్ బ్యాక్ సూన్ అన్నమాట…! వచ్చే యేడాది సెట్స్ మీదకు వెళ్తుందని అంచనా మరి.
Advertisement